ELR: ఉంగుటూరు మండలం గోకవరం గ్రామానికి చెందిన మారిశెట్టి శ్రీను గ్రామ శివారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ ఆదివారం దాడి చేసి పట్టుకున్నారు. అతని వద్ద 40 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసినట్లు చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ తెలిపారు.