కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జీ బాధ్యతలను అప్పగించారు. దీంతో కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం గుర్రుగా ఉన్నారు. వైసీపీ సోషల్ మీడియా మాత్రం శివరాంను వెనకేసుకొని వస్తోంది.
Kodela Sivaram: మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ (Kodela shivaprasad) చనిపోయినప్పటీ నుంచి సత్తెనపల్లి టీడీపీ వ్యవహారాలను చూసుకుంటున్నారు కోడెల కుమారుడు శివరాం (Kodela Sivaram). వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ దక్కుతుందని.. కోడెల భార్య, కుమారుడు శివరామ్ జనంలో ఉన్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సత్తెనపల్లి ఇంచార్జీ బాధ్యతలను కన్నా లక్ష్మీనారాయణకు ఇచ్చారు. దీంతో ఆ స్థానం నుంచి కన్నా పోటీ అనివార్యం.. దీంతో కోడెల శివరాం (Sivaram) కోపంతో ఉన్నారు.
4 ఏళ్లలో ఏ ఒక్క రోజు కూడా
చంద్రబాబును వ్యతిరేకించి.. కోర్టులో కేసు వేసిని వ్యక్తి పార్టీలో చేరితే ఇంత గౌరవం ఇస్తారా అని కోడెల శివరాం (Kodela Sivaram) అంటున్నారు. గత 4 ఏళ్లుగా పార్టీ కోసం ఎంతో చేసిన తమను ఏ రోజైనా చంద్రబాబు (chandrababu) పిలిచి మాట్లాడింది లేదన్నారు. కనీసం 5 నిమిషాల సమయం కూడా ఇవ్వలేదని చెప్పారు. కన్నా (kanna) ఇంచార్జీ ప్రకటన తర్వాత కోడెల శివరాం (Kodela Sivaram) ఆగ్రహాంతో ఉన్నారు. ఆయనను కూల్ చేసేందుకు రంగంలోకి అచ్చెన్నాయుడిని దింపారు.
వైసీపీ సోషల్ మీడియా సపోర్ట్ వెనక
కోడెల శివరాంకు (Kodela Sivaram) వైసీపీ సోషల్ మీడియా (ycp social media) బాసటగా నిలుస్తోంది. ఆయన పట్ల టీడీపీ హై కమాండ్ అనుసరించిన వ్యుహం సరికాదని అంటోంది. ఇప్పటివరకు టీడీపీ నుంచి కోడెల శివరాం (Kodela Sivaram) బరిలోకి దిగుతారని.. జనసేన (janasena) నుంచి మరొకరు ఉంటారని భావించింది. ఇదీ తమ పార్టీకి లాభిస్తోందని అనుకుంది. ఇక్కడ మరోసారి తమ అభ్యర్థి గెలుపు ఖాయం అని లెక్కగట్టింది. కానీ వైసీపీ అంచనాలు తలకిందులు అయ్యాయి.
అంబటి రాంబాబుపై మాత్రం..
నియోజకవర్గంలో వైసీపీకి మంచి పేరు ఉందని.. అంబటి రాంబాబు (ambati rambabu) అభ్యర్ధిత్వంపై అంతగా నమ్మకం లేదట. అందుకే శివరాం (Sivaram)బరిలోకి దిగితే బాగుంటుందని అనుకుంది. టీడీపీ షాక్ ఇవ్వడమే కాక.. శివరాం (Kodela Sivaram), మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, అబ్బురు మల్లీ, నాగొతు సౌరయ్యకు పార్టీ బాధ్యతలను అప్పగించింది. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు. కన్నాను నియమించే వరకు పట్టించుకోలేదని.. ఇప్పుడు మాత్రం హడావిడి చేస్తున్నారని కోడెల శివరామ్ (Kodela Sivaram) అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ సోషల్ మీడియా అనుకూలంగా ఉంది. ఎందుకంటే శివరాం (Kodela Sivaram) తమ ప్రత్యర్థి అభ్యర్థిగా ఉంటే అంతగా పోటీ ఉండదని అనుకుంది. కానీ ఆ అవకాశం లేదు.