విశాఖ రైల్వే జోన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. విశాఖ రైల్వే జోన్ విషయంలో వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రైల్వే జోన్ రావటం లేదనే వార్తలు అవాస్తవమని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీ అని గుర్తుచేశారు. అప్పటి ప్రధానమంత్రి కూడా రాజ్యసభలో ఈ అంశాన్ని స్పష్టం చేశారని గుర్తుచేశారు.
MPల బృందంతో వెళ్ళి కలిసినప్పుడు స్వయంగా రైల్వే శాఖ మంత్రి హామీ ఇచ్చారని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. ప్రక్రియ చివరి దశలో ఉందని..త్వరలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చిన విషయాన్ని విజయసాయిరెడ్డి తెలిపారు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన నిన్నటి సమావేశంలో అసలు రైల్వే జోన్ కు సంబంధించిన ప్రస్తావనే రాలేదని వివరించారు. కొవ్వూరు మీదుగా తెలంగాణ ప్రాంతాలతో కనెక్ట్ చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరుగలేదని తెలిపారు. రైల్వే జోన్ అంశం విభజన చట్టంలో ఉన్నందున మొత్తం ఖర్చు కేంద్రమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని విజయసాయిరెడ్డి తెలిపారు.