Water: అసలే సరిపడ వృక్షాలు లేవు.. చెట్లను (Tree) కొట్టొద్దని పర్యావరణ వేత్తలు నెత్తి, నోరు బాదుకుంటున్నారు. దీంతో అడవుల్లో ఉండే కోతులు.. జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎంత చెప్పిన కొందరు చెవికి ఎక్కించుకోవడం లేదు. ప్రకాశం జిల్లాలో చెట్లను కొడుతున్నారు. అలా నరకగా.. ఆ చెట్టు (tree) నుంచి నీరు వస్తోంది. ఆ ఘటన చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది.
అర్దవీడు మండలం పోతురాజుటూరు గ్రామ శివారులో చెట్లు నరుకుతున్నారు. సగం వరకు కొట్టగా.. ఒక్కసారిగా అందుల్లోంచి నీరు వచ్చింది. అక్కడ ఉన్న కొందరు పిల్లలు ఆ నీటితో చేతులు కడుక్కున్నారు. మరికొందరు తాగారు. చల్లగా ఉన్నాయని.. తీయగా ఉన్నాయని అంటున్నారు. మిగతా వారు ఫోటోలు, వీడియో తీసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు.
చెట్లను నరకొద్దు.. పర్యావరణానికి హానీ కలిగించొద్దు అని ప్రభుత్వాలు స్లోగాన్స్ ఇస్తున్నాయి. కొందరు మారడం లేదు. ఉపాధి పేరుతో చెట్లను నరుకుతూ జీవిస్తున్నారు. అలా చేయడంతో అడవీ నశించిపోతుంది. అటవీ జీవుల జీవనం ప్రశ్నార్థకం అవుతోంది. ఒకప్పటిలా జీవజాతులు ఉండటం లేదు. కొన్ని సందర్భాల్లో ఎలుగుబంట్లు కూడా ఇళ్లలోకి వచ్చిన ఘటనలను మనం చూశాం.
చెట్లు నరుకుతుండగా వింత ఘటన
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామం అటవీ ప్రాంతంలో చెట్లు నరుకుతుండగా చెట్టు నుంచి మంచినీళ్లు రావడంతో ఆ చెట్టును చూడడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంగా వెళ్తున్నారు. ఆ చెట్టు నుండి వస్తున్న నీళ్లను కూడా తాగుతున్నారు. pic.twitter.com/hpGe1Yfwwc
పర్యావరణ వేత్త సుందర్ లాల్ బహుగుణ చిప్కో (chipko) ఉద్యమం చేశారు. చెట్ల నరికివేతను అడ్డుకుంటూ.. చెట్లను నరికివేసే సమయంలో చిప్కొ అంటూ వృక్షాలను కౌగిలించుకునేవాడు. జనాల్లో అవెర్ నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినా కొన్ని చోట్ల జనాలకు అవేమి పట్టడం లేదు.