kesineni chinni:వంశీకి ఓటమి భయం పట్టుకుంది: కేశినేని చిన్ని
kesineni chinni:గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్పై (vallabhaneni vamsi mohan) టీడీపీ నేత కేశినేని చిన్ని (kesineni chinni) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలవననే భయం పట్టుకుందన్నారు. ఓటమి భయంతోనే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని ఆరోపించారు.
kesineni chinni:గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్పై (vallabhaneni vamsi mohan) టీడీపీ నేత కేశినేని చిన్ని (kesineni chinni) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలవననే భయం పట్టుకుందన్నారు. ఓటమి భయంతోనే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని ఆరోపించారు. వంశీ (vamsi), నాని (nani) ఇద్దరూ విష పురుగులేనని హాట్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాలని వంశీని డిమాండ్ చేశారు. ఈ సారి గన్నవరం, గుడివాడలో టీడీపీ గెలువనుందని ధీమా వ్యక్తం చేశారు.
ధైర్యంగా ఉండండి..
గన్నవరంలో టీడీపీ కార్యాలయ ఆవరణలో దాడి అంశం అగ్గిరాజేసింది. ఇదే అంశంపై టీడీపీ నేతలు- వైసీపీ లీడర్ల మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. పట్టాభి ఆచూకీ తెలుపాలని టీడీపీ నేతలు, ఆయన భార్య చందన అడిగారు. గన్నవరం పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు పట్టాభి భార్య చందనను కేశినేని చిన్ని (kesineni chinni) పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచించారు. తాము అంతా అండగా ఉంటామని హామీనిచ్చారు.
టార్గెట్ బాబు, లోకేశ్
గత ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరఫున వంశీ (vamsi) బరిలోకి దిగారు. ఆ తర్వాత వైసీపీలో (ycp) చేరదామని అనుకున్నాడు. రాజీనామా చేసి రావాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీంతో ఆయన చేరిక ఆలస్యమైంది. వచ్చే ఎన్నికల్లో మాత్రం వైసీపీ నుంచి బరిలోకి దిగుతానని అంటున్నారు. చంద్రబాబు (chandrababu), లోకేశ్ (lokesh) లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. అలా కామెంట్ చేయగా.. టీడీపీ నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. తమ నేతనే తిడతారా అని వంశీ అనుచరులు గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద బీభత్సం చేశారు. సోమవారం (నిన్న) నుంచి ఈ అంశంపై వివాదం చెలరేగుతూనే ఉంది.
అరెస్ట్..
సాయంత్రం గన్నవరం వచ్చిన పట్టాభిని (pattabi) పోలీసులు (police) అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారని అభియోగాలు మోపారు. రాత్రంతా వాహనంలోనే తిప్పారు. ఈ రోజు మధ్యాహ్నం గన్నవరం పీఎస్కు తీసుకొచ్చారు. అక్కడే వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరు పరిచారు.
ఇక్కడి నుంచి బరిలోకి
కేశినేని చిన్ని (kesineni chinni) రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నుంచి హామీ వచ్చినట్టు తెలిసింది. కానీ అతని సోదరుడు కేశినేని నాని మాత్రం విభేదిస్తున్నారు. తన తమ్ముడే కాదు.. మరో నలుగురికి విజయవాడ లోక్ సభ సీటు ఇస్తానంటే ఒప్పుకోనని చెబుతున్నాడు. నాని రెండుసార్లు విజయవాడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.