సినిమా అనౌన్స్మెంట్ అయితే చాలు.. రిలీజ్ వరకు అంచనాలు ఆకాశాన్నంటుతునే ఉంటాయి. మేకర్స్ జస్ట్ అలా హింట్ ఇస్తే చాలు.. ఫ్యాన్స్ దాన్ని అల్లుకుపోయి విపరీతమైన అంచనాలను పెంచెసుకుంటారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై కూడా హైప్ స్టార్ట్ అయింది. భవదీయుడు భగత్ సింగ్ కాస్త ఉస్తాద్ భగత్ సింగ్‌గా మారడంతో.. ఈ సినిమా పై రకరకాల ఊహగానాలొస్తున్నాయి. తేరీ రీమేక్ అని పవర్ స్టార్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. అయినా డైరెక్టర్ హరీష్ శంకర్ దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ ఇది స్ట్రెయిట్ మూవీనే అని గట్టిగా నమ్ముతున్నారు. అంతేకాదు గబ్బర్ సింగ్‌కు మించి ఈ సినిమా ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టే.. తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ఓ ఇంటర్వ్యూలో ర్యాపర్ ప్రణవ్ చాగంటి.. తాను ఈ సినిమాలో టైటిల్ ట్రాక్ రాస్తున్నట్టు తెలిపాడు.
పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇది బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్‌కి థ్యాంక్స్ చెప్పాడు. దాంతో భారీగా అంచనాలను పెంచేసుకుంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ప్రజెంట్ సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవన్. సమ్మర్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా పవన్ ఇంట్రడక్షన్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే.