ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పిఠాపురం – సామర్లకోట మధ్య పట్టాలు గూడ్స్ రైలు పట్టాలు తప్పగా.. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. రైలు పట్టాలు తప్పడంతో విశాఖపట్నం నుంచి విజయవాడ రూట్లో పలు రైళ్లు రాకపోకలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు తెలిపారు. పిఠాపురంలో స్టేషన్లో యశ్వంతపూర్, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని రైలు పట్టాలను సరి చేస్తున్నారు. సామర్లకోట పిఠాపురం మధ్య కే ట్రాక్‌పై ట్రైన్స్ అధికారులు నడిపిస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గంటకిపైగా గోపాల పట్నం స్టేషన్లో విశాఖ ఎక్స్ ప్రెస్ నిలిపివేసింది. గోదావరి ఎక్స్‌ప్రెస్ సైతం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రైల్వే తెలిపారు.