ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు చేశారు. జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే…చంద్రబాబుపై విమర్శలు చేయడం గమనార్హం. రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసింది.. జగన్ అని చెప్పారు. బీసీలకు పదవులు ఇచ్చి ప్రోత్సహించింది కూడా జగనేనని స్పష్టం చేశారు. ఎంపీపీ పదవుల్లో 67 శాతం పదవులు ఇచ్చి.. బీసీలకు 56 కార్పొరేషన్లు కేటాయించారని వివరించారు. బీసీలంతా ఆలోచించుకుని.. జగన్ వెంట నడవాలని తమ్మినేని సీతారాం బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.
తోకలు కత్తిరిస్తాను అన్నందుకే.. చంద్రబాబు పిలక కత్తిరించి, గుండుకు సున్నం రాశారని.. స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు. చరిత్ర తెలియని వాళ్లు బీసీల తోకలు కత్తిరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకృష్ణుడు యాదవ బీసీ, వాల్మీకి బోయ బీసీ, రాముడు గుహుడు జాలరి బీసీ, భీష్ముడు గంగా పుత్రుడు, చరిత్ర తెలియని వాళ్లు తోకలు కత్తిరిస్తారా? అని ఫైర్ అయ్యారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారా? అని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. బీసీల దెబ్బ ఏంటో చంద్రబాబుకు తెలుసన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ముసుగులు వేసుకుని మారువేషంలో వస్తున్నారని ఆయన ఆరోపించారు.