Jagananna Suraksha: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష (Jagananna Suraksha) పథకంలో తెలంగాణ మందులు కనిపించాయి. ఆ మందుల సీసాపై తెలంగాణ లేబుల్ స్పష్టంగా కనిపించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏం జరిగిందని వైద్యాధికారి విద్యాసాగర్‌ను వివరణ కోరగా మందులు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎవరూ సఫ్లై చేశారన్న అంశంపై స్పష్టత లేదని చెప్పారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఈ ఘటన జరిగింది. గవర్నమెంట్ హై స్కూల్లో జగనన్న సురక్ష (Jagananna Suraksha) ఆరోగ్య శిబిరం నిర్వహించారు. రోగులకు ఇచ్చిన మందుల్లో తెలంగాణ లేబుల్ కనిపించింది. దగ్గు మందు బాక్స్‌పై తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసే లేబుల్ ఉంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏం జరిగిందనే ప్రశ్న అందరి మెదళ్లను తొలచివేసింది. కానీ దీనికి అధికారుల నుంచి సరైన వివరణ రాలేదు.
ఇటీవల యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. రోగులు మందులు ఉండవా.? అని విరుచుకుపడ్డారు. ఆ వెంటనే తెలంగాణ మందులు దర్శనం ఇచ్చాయి. దీంతో ఎవరూ ఈ మందులు తెప్పించారనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం మాత్రం లేదు.