»Suicide Satvik Letter Due To Sri Chaitanya Junior College Torture
Satwik Suicide Letter: కాలేజ్ వాళ్ల టార్చర్ వల్లే ఆత్మహత్య చేసుకున్నా
ఇటీవల నార్సింగి శ్రీచైతన్య కాలేజీ(sri chaitanya junior college)లో ఆత్మహత్య చేసుకున్న సాత్విక్(Satvik) సూసైడ్ లెటర్లో(Suicide letter) సంచలన విషయాలను వెల్లడించాడు. అయితే తన మృతికి కారణం కాలేజీలో ప్రిన్సిపల్, ఇంచార్జీ, లెక్చరేనని వెల్లడించాడు. వీరి టార్చర్ వల్లనే తాను సూసైడ్ చేసుకున్నట్లు సాత్విక్ తెలిపాడు. అంతేకాదు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో వెల్లడించాడు.
రంగారెడ్డి జిల్లా నార్సింగి(narsingi)లో శ్రీచైతన్య కాలేజ్(sri chaitanya junior college) విద్యార్థి సాత్విక్(Satvik) సూసైడ్(Suicide) కేసులో లభించిన లెటర్(letter) ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ లేఖలో కాలేజ్ ప్రిన్సిపల్, ఇంఛార్జీ, లెక్చరర్ పెట్టిన టార్చర్ వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సాత్విక్ పేర్కొన్నాడు. ఆ క్రమంలో కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేష్ పెట్టిన ఇబ్బందులను తట్టుకోలేక పోయాయని రాసుకొచ్చాడు. ఆ టార్చర్ తట్టుకోవడం నా వల్ల కాలేదు. అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని సాత్విక్ లెటర్లో వెల్లడించాడు. అంతేకాదు తన హాస్టల్లో(hostel) వీరు ముగ్గురు విద్యార్థులకు టార్చర్ చూపించారని వెల్లడించాడు.
ఈ క్రమంలో వారిపై తప్పకుండా యాక్షన్(action) తీసుకోవాలని తన అమ్మను లేఖ(letter)లో కోరాడు. నేను మీ అందరిని చాలా బాధ పెడుతున్నందుకు సారీ. లవ్ యూ అమ్మా, నాన్న, మిస్ యూ ఫ్రెండ్స్ అంటూ లేఖలో తెలిపాడు. ఈ నేపథ్యంలో సారీ అమ్మ నాన్న మీరు బాధపడకండి. మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదని పేర్కొన్నాడు. అన్న నువ్వు అమ్మ నాన్న(mother and father)కు ఏ లోటు రాకుండా చూసుకో అంటూ సాత్విక్ లెటర్లో తెలిపాడు.
నార్సింగి పరిధిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో సాత్విక్(Satvik) ఇంటర్మీయట్ ఫస్ట్ ఇయర్(inter first year) చదువుతున్నాడు. కేశంపేట మండలం కొత్తపేటకు చెందిన రాజప్రసాద్-అలివేలు దంపతులు వ్యాపారం నిమిత్తం షాద్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీళ్ల అబ్బాయి అయిన సాత్విక్ నార్సింగి శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల శివరాత్రికి ఇంటికి వెళ్లి మళ్లీ వచ్చిన సాత్విక్ మంగళవారం రాత్రి 10 తర్వాత తరగతి గదిలో ఊరేసుకుని సూసైడ్ అటెమ్ట్ చేసుకున్నాడు.
మరోవైపు ఈ ఘటనపై పలు విద్యార్థి సంఘాలు వారి కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేశాయి. విద్యార్థి(student) మృతి(died)కి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్(demand) చేశారు. అంతేకాదు ఇలా విద్యార్థులను ర్యాంకుల పేరుతో టార్చర్ చేస్తున్న కాలేజీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.