రాజమండ్రి (Rajahmundry) సెంట్రల్ జైల్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డీఐజీ ముదపురెడ్డి రవికిరణ్ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన (Mantri buggana) రాజేంద్రనాథరెడ్డికి సమీప బంధువు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ కారాగారంలో రిమాండు(Remand)లో ఉన్న సమయంలో ఆకస్మికంగా ఈ పరిణామాలు చోటుచేసుకోవటంలో ఆ లోగుట్టు ఏంటిని తెలుగు దేశం నాయకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో రవికిరణ్ (Ravi Kiran) వైసీపీకు అనుకూలంగా ఉన్నారని పనిచేసిన చోటల్లా వారికి మేలు కలిగేలా పనిచేశారని టీడీపీ ఆరోపిస్తోంది.
కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీలుగా ఉన్న వివేకా హత్య(Viveka’s murder)కేసు నిందితులకు, ప్రధానంగా ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డి (Avinash Reddy) అనుంగు అనుచరుడైన దేవిరెడ్డి శివశంకరరెడ్డికి రాచమర్యాదలు చేశారన్న విమర్శలున్నాయి. ఆయన డీఐజీ(DIG)గా ఉన్నప్పుడే కోర్టు అనుమతి లేకుండానే శివశంకరరెడ్డిని జైలు నుంచి రిమ్స్‌కు తీసుకెళ్లారు. అలాంటి అధికారిని చంద్రబాబును నిర్బంధించిన జైలు సూపరింటెండెంట్‌గా నియమించటంపై టీడీపీ అనేక అనుమానాలను లేవనెత్తుతోంది.రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం బాధ్యతలు తీసుకున్న రవికిరణ్(Ravi Kiran)… చంద్రబాబును శుక్రవారం ములాఖత్‌లో కలిసేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి చేసుకున్న దరఖాస్తును తిరస్కరించారు.
వారంలో రెండుసార్లే ములాఖత్‌కు అవకాశం ఉంటుందని, అత్యవసరమైతే తప్ప మూడోసారి వీలుండదని మీడియా ప్రకటన రిలీజ్ చేశారు. చంద్రబాబు (Chandrababu) 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 73 ఏళ్ల వయసు. అనేక అనారోగ్య సమస్యలూ ఉన్నాయి. అలాంటి ఆయన్ను కలిసేందుకు… ఆయన భార్యకే ములాఖత్ (Mulakat) నిరాకరించారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే రవికిరణ్‌ను వ్యూహాత్మకంగా అక్కడ నియమించారనే వాదన వ్యక్తమవుతోంది. చంద్రబాబు పట్ల కఠినంగా వ్యవహరించేందుకు, ఆయన్ను మానసికంగా కుంగదీసేందుకే రవికిరణ్‌ను తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది.