»Perni Nani Satires To Payyavula Keshav On Victory
payyavula keshav వచ్చే ఎన్నికల్లో ఉరవకొండ నుంచి గెలవాలి, పేర్ని నాని సెటైర్స్, కౌంటర్
perni nani satires to payyavula keshav:టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (payyavula keshav), వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని (perni nani) మధ్య ఈ రోజు అసెంబ్లీ లాబీలో ఆసక్తికర డిస్కషన్ జరిగింది. వచ్చే ఎన్నికల్లో మీరే మళ్లీ గెలవాలని పేర్ని నాని (perni nani) పలకరింపు స్టార్ట్ చేశారు. నాని అలా అనడంలో మరో అర్థం కూడా ఉంది. ఉరవకొండలో ఏ పార్టీ విజయం సాధిస్తే.. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉండనే ఉంది.
perni nani satires to payyavula keshav:ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిపైగా సమయం ఉంది. ప్రతిపక్ష నేతలు యాత్రలతో జనానికి దగ్గర అవుతున్నారు. అధికార వైసీపీ (ycp) తన పథకాలను చెప్పుకుంటుంది. ఈ రోజు అసెంబ్లీ లాబీలో ఆస్తికర ఘటన జరిగింది. ఎప్పుడూ.. ఉప్పు నిప్పుగా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (payyavula keshav), వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని (perni nani) మధ్య డిస్కషన్ జరిగింది. అదీ కూడా ఎన్నికలు.. గెలుపు గురించే వారి మధ్య చర్చకు వచ్చింది.
వచ్చే ఎన్నికల్లో మీరే మళ్లీ గెలవాలని పేర్ని నాని (perni nani) పలకరింపు స్టార్ట్ చేశారు. నాని అలా అనడంలో మరో అర్థం కూడా ఉంది. ఉరవకొండలో ఏ పార్టీ విజయం సాధిస్తే.. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉండనే ఉంది. దీనిని ఉటంకిస్తూ నాని (nani) కామంట్ చేశారు. పేర్ని నాని (perni nani) సెటైరికల్ కామెంట్లపై పయ్యావుల కేశవ్ (payyavula keshav) కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు.
2024లో తమ పార్టే విజయం సాధిస్తోందని కేశవ్ (keshav) చెప్పారు. ఇందుకు ఆయనో కారణం వివరించారు. 2024లో 1994లో వచ్చిన ఫలితాలే రిపీట్ అవుతాయని చెప్పారు. 1994లో ఉరవకొండలో టీడీపీ గెలిచి.. అధికారం కూడా చేపట్టింది. వచ్చే ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందని పేర్కొన్నారు. అంటే తమ పార్టీ విజయం తథ్యం అనే ధీమాతో పయ్యావుల ఉన్నారు.
టీడీపీకి పయ్యావుల కేశవ్ (payyavula keshav) ఫైర్ బ్రాండ్.. చంద్రబాబుకు (chandrababu) సన్నిహితం కలిగిన నేత. ఏ అంశం అయినా సరే ఏకీపారేస్తుంటారు. వైసీపీకి పేర్ని నాని (perni nani) కూడా అలాంటి నేతే.. టీడీపీ నేతల లక్ష్యంగా తరచూ విమర్శలు చేస్తుంటారు. ఇద్దరు నేతుల లాబీలో కలిసి ఆప్యాయంగా పలుకరించుకొని.. చివరకు మీరే గెలవాలని.. గెలిస్తే ఇలా అని సెటైర్స్ వేసుకున్నారు.