»Pawan Kalyans Mass Following On Instagram Such A Huge Following Within Hours
Pawan Kalyan: ఇన్‌స్టాలోకి పవర్ స్టార్..నిమిషాల్లోనే లక్షల ఫాలోవర్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టారు. అకౌంట్ ఓపెన్ చేసిన గంటల్లోనే మిలియన్లలో ఫాలోవర్స్ ను ఆయన సొంతం చేసుకున్నారు.
Pawan Kalyan's mass following on Instagram.. such a huge following within hours
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. నిన్నటి వరకు ఫేస్బుక్(Facebook), ట్విట్టర్(Twitter) లో మాత్రమే ఉన్న జనసేనాని(Janasenani) మంగళవారం ఇన్స్టాగ్రామ్(Instagram)లోకి అడుగు పెట్టాడు. ఉదయం ఆయన ఖాతా తెరిచిన కాసేపటికే వెరిఫైడ్ లభించింది. ఈ ఖాతాను ప్రారంభించిన గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్ దాటేశారు. అంటే సింగిల్ పోస్ట్ లేకుండానే ఫాలోవర్స్ పెరిగిపోయారు. ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా ఆయన రాజకీయాలకు సంబంధించిన విషయాలను ఎక్కువగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇన్‌స్టా వేదికగా రాజకీయాలతో పాటు సినిమా విశేషాలను కూడా షేర్ చేయనున్నారని తెలుస్తోంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో… జై హింద్ అనే స్లోగన్ ఉన్న ఈ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ కు అభిమానులు పెద్ద ఎత్తున ఫాలో కొడుతున్నారు.
ఇంత త్వరగా అంత మంది ఫాలోవర్స్ సంపాదించుకున్న వారిలో పవన్ ముందు వరసలో నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో దక్షిణ ఇండియాలోనే ఇంత మందిని తన ఫాలోవర్స్ గా చేసుకున్న పవన్ నిలవడం గమనార్హం. కొద్ది నెలల క్రితం తమిళ స్టార్ హీరో విజయ్ సైతం ఇలాంటి ఫీట్ ను సాధించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే వరుసలో ఇన్ స్టా గ్రామ్(Pawan Kalyan on Instagram) లో యమ క్రేజీగా మారారు. ఇక వారాహి యాత్రతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచిన పవన్ కళ్యాణ్ తనదైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాలోకి వచ్చిన 8 గంటల్లోనే 10 లక్షల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నారు. ఒక్క పోస్ట్ కూడా లేకుండానే ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్స్ పొందిన ఏకైక నటుడిగా పవన్ రికార్డ్ నెలకొల్పాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ సాధించిన రికార్డ్‌ను ఆయన అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.