»Pawan Kalyans 4th Varahi Vijayatra From October 1
Janasena: అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి విజయయాత్ర
అక్టోబర్ 1వ తేది నుంచి జనసేన వారాహి విజయయాత్ర నాలుగో విడత ప్రారంభం కానుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి ఆ యాత్ర పునఃప్రారంభమవుతుందని, జనసేన సైనికులు యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
చంద్రబాబు అరెస్ట్‌కు ముందు విశాఖలో రిషికొండ (Rishikonda) వద్ద ఏపీ సర్కార్ నిర్మిస్తున్న భవణాలను పవన్ పరిశీలించారు. పోలీసులు అడ్డుపడినా కూడా జనసైనికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అయితే ఇప్పటి వరకూ మూడు పర్యాయాలు జనసేన వారాహి విజయయాత్రను పవన్ చేపట్టారు. ఏపీలోని రాజకీయ పరిస్థితులు, సినిమాల నిర్మాణం వల్ల ఆ యాత్రకు ప్రస్తుతం బ్రేక్ ఇచ్చారు.
తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నాలుగో విడత వారాహి విజయయాత్ర (Varahi Vijaya Yatra)ను చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 1వ తేది నుంచి వారాహి విజయయాత్ర ప్రారంభం కానున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహల్ ప్రకటించారు. ఈ యాత్ర కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ప్రారంభం కానుందని, షెడ్యూల్ కూడా ఖరారైందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మరో ఐదు రోజుల్లో వారాహి విజయ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో నాదెండ్ల మనోహర్ (Nadendla manohar) టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు విషయాలను చర్చించారు. అవనిగడ్డలో మొదలయ్యే ఆ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగుతుందని, జనసేన సైనికులంతా ఈ యాత్రను విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.