జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan) త్వరలో పోలవరంలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. తాజాగా నాదేండ్ల మనోహర్(nadendla manohar) ఏలూరు పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. విశాఖ ఘటన ప్రభుత్వ కుట్రే అని ఆరోపించారు. ఏలూరు చేరిన మనోహర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా మనోహర్ అన్నారు. నిజాయితీగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ప్రశంసించారు. సంక్రాంతి తర్వాత పవన్ పోలవరం ప్రాంతంలో పర్యటిస్తారని మనోహర్ వెల్లడించారు. పవన్ సెక్యూరిటి విషయంలో మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ భద్రతపై ఇటీవలే జనసేన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ ప్రాణాలకు హాని ఉందని అనుమానం వ్యక్తం చేసింది. అనుమానాస్పద వాహనాలు కొన్నిరోజులుగా పవన్ కళ్యాణ్‌ను అనుసరిస్తున్నాయని జనసేన నేతలు తెలిపారు. పవన్ ఇంటి వద్ద కూడా కొందరు అనుమానాస్పద వ్యక్తుల కదలికలు పెరిగాయని ఆరోపణలు చేశారు.