• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి కలెక్టర్ నివాళులు

TPT: కలెక్టరేట్‌లో ఆదివారం స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన చిత్రపటానికి కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో DR&O జి.నరసింహులు, ఆధికారులు పాల్గొన్నారు.

February 22, 2026 / 12:33 PM IST

కందుల నాగరాజు ఆర్థిక సాయం

VSP: విశాఖలోని 32వ వార్డు నేరెళ్ల కోనేరు ప్రాంతానికి చెందిన పెద్దిలమ్మ మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు, కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టాల్లో ఉన్న వారికి ఎల్లప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటానన్నారు.

February 22, 2026 / 12:30 PM IST

ప్రజల ఆనందం- ఆరోగ్యం లక్ష్యం: మంత్రి

కోనసీమ: విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి వారికి ఆనందం, సంతోషం అందించే లక్ష్యంతో ‘హ్యాపీ సండే’ నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం రామచంద్రపురం చింతపల్లి సూరన్న నగర్‌లోని బాలికల హైస్కూల్లో జరిగిన హ్యాపీ సండే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మానసిక ప్రశాంతత కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

February 22, 2026 / 12:30 PM IST

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలు సందర్శించిన సీఐ

ప్రకాశం: కొమరోలు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఆదివారం గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య, స్థానిక ఎస్సై నాగరాజుతో కలిసి సందర్శించారు. పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసు సిబ్బందికి, పరీక్షా నిర్వహణ అధికారికి తెలియజేశారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.

February 22, 2026 / 12:28 PM IST

మచిలీపట్నంలో టీడీపీ పార్లమెంటు కార్యాలయానికి భూమిపూజ

కృష్ణా: మచిలీపట్నంలో టీడీపీ శాశ్వత పార్లమెంటు కార్యాలయ నిర్మాణానికి నేడు అట్టహాసంగా శంకుస్థాపన జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జిల్లా అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, ఎమ్మెల్యేలు ఈ వేడుకలో పాల్గొన్నారు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత సొంత భవనం ఏర్పాటు కానుండటంతో కార్యకర్తలు పండుగలా వేడుక చేసుకున్నారు.

February 22, 2026 / 12:26 PM IST

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

PLD: డిజిటల్ ప్రపంచంలో ముప్పు పొంచి ఉందని, ముఖ్యంగా గృహిణులు, వయోవృద్ధులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలు జరుగుతున్నాయని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదని, పార్ట్ టైమ్ జాబ్స్ ఫిషింగ్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదివారం సూచించారు. మోసపోయామని గుర్తిస్తే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.

February 22, 2026 / 12:25 PM IST

ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

TPT: రేణిగుంట మండలం మామండూరు అటవీ ప్రాంతంలోని జలపాతంలో చెన్నైకి చెందిన మణికంఠన్ (27) మునిగి మృతి చెందాడు.స్నేహితుడు శ్రీనివాసన్తో కలిసి బైక్‌పై విహారయాత్రకు వచ్చి జలపాతం వద్ద ఈత కొట్టేందుకు నీటిలోకి దిగాడు. అయితే సుమారు 8 అడుగుల లోతైన గుంటలో మునిగిపోవడంతో బయటకు రాలేకపోయాడు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

February 22, 2026 / 12:22 PM IST

జంగారెడ్డి బైపాస్‌లో లారి బోల్తా

ELR: జంగారెడ్డిగూడెం స్థానిక బైపాస్‌లో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ఆర్చి వద్ద లారీ బోల్తా పడింది. తెలంగాణ వైపు నుంచి రాజమండ్రి సైడ్ వెళ్తున్న లారీ ఆర్చి దగ్గరకి రాగానే అదుపుతప్పి ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ గోవింద్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి.

February 22, 2026 / 12:17 PM IST

లైబ్రరీలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి

AKP: నర్సీపట్నం శాఖా గ్రంథాలయంలో తేదీ మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. నరసింహారెడ్డి చిత్రపటానికి రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనకు తెలియని స్వాతంత్ర్య సమరయోధులు ఎందరో ఉన్నారని పేర్కొన్నారు.

February 22, 2026 / 12:16 PM IST

మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘనంగా నివాళులు

ATP: గుంతకల్లులో భారతదేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 68వ వర్ధంతిని నిర్వహించారు. ముందుగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి టీడీపీ మండల ఇన్‌ఛార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అబుల్‌ కలాం చేసిన సేవలను కొనియాడారు. విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్దికి ఎంతగానో కృషి చేశారన్నారు.

February 22, 2026 / 12:15 PM IST

డ్వాక్రా మహిళలకు రూ. 10వేల నుంచి రూ. లక్ష వరకు రుణం

KDP: కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ పథకం మార్చి నెలలో శ్రీకారం చుట్టనుంది. దీని కింద డ్వాక్రా మహిళల కుటుంబాల్లో కుమార్తెల వివాహం కోసం రుణం తీసుకోవచ్చు. రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పావలా వడ్డీకి మాత్రమే ఈ రుణాలు పొందవచ్చు. ఈ రుణాన్ని 48వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది.

February 22, 2026 / 12:10 PM IST

28 ఏళ్ల మహిళ ఆత్మహత్య

ASR: రంపచోడవరం యర్రంరెడ్డినగర్ నివాసంలో శనివారం విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఆశాజ్యోతి(28) ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ సన్యాసినాయుడు మీడియాకు తెలిపారు. దేవీపట్నం మండలానికి చెందిన ఆశాజ్యోతి, శివకుమార్ దంపతులు హోటల్ నిర్వహిస్తూ రంపచోడవరంలో గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు.

February 22, 2026 / 12:08 PM IST

వైసీపీ నాయకులపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. శాసనమండలిలో శ్రీవారి చిత్రపటాలను చెప్పుల కాళ్లతో తాకి అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఆదివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. రసాయనాలతో కూడిన నెయ్యిని ఉపయోగించి కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు.

February 22, 2026 / 12:01 PM IST

మసీదుల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణం ఖాజా నగర్‌లో ఉన్న ఉర్దూ పాఠశాల, మసీదుల వద్ద చెత్తా అపరిశుభ్రంగా ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజలు నగర కమిషనర్ బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు నాయకులు దగ్గరుండి చెత్తా తొలగించి మసీదు వద్ద శానిటేషన్ పనులు చేశారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

February 22, 2026 / 12:00 PM IST

‘ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే’

ప్రకాశం: ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని మార్కాపురం శివారులో వెలసిన శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఆదివారం కావడంతో భక్తులు రద్దీ అధికంగా ఉండడంతో పోలీసులు పట్టిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 12:00 PM IST