• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘అనుమానాస్పద వ్యక్తులతో అప్రమత్తంగా ఉండండి’

TPT: వరదయ్యపాలెం ఎస్సై మల్లికార్జున్ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల అనుమానాస్పద కదలికలు పెరగడంతో రాత్రివేళల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలియని వ్యక్తులతో సమాచారం పంచుకోవద్దని, వాహనాలు వెలుతురు ఉన్న ప్రదేశాల్లోనే పార్క్ చేయాలని చెప్పారు. అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ 9440900725 కు సమాచారం ఇవ్వాలన్నారు.

February 20, 2026 / 01:32 PM IST

నవశక్తి దేవతల ఆలయ సముదాయం పునఃప్రారంభం

VSP: భీమిలి నియోజకవర్గంలోని శ్రీ నవశక్తి దేవతల ఆలయముల సముదాయం పునఃప్రారంభ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 4వ వార్డ్ కార్పొరేటర్ దవులపల్లి కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరమ్మ హాజరయ్యారు.

February 20, 2026 / 01:30 PM IST

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

TPT: ఎర్పేడు సమీపంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సెక్యూరిటీ నర్స్‌–01, ఇన్‌స్ట్రుమెంట్ టెక్నీషియన్‌–02 పోస్టులు కలిపి మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి. ఇతర వివరాల కోసం https://www.iittp.ac.in/Outsourced_Positions వెబ్‌సైట్ చూడాలన్నారు.

February 20, 2026 / 01:28 PM IST

‘అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలి’

E.G: అసంఘటిత రంగ కార్మికులకు భద్రత కరువైందని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయు జిల్లా నాయకులు కొక్కిరిపాటి వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నల్లజర్లలో మండల బజారు జట్టు వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశం జరిగింది. పాలకవర్గాలకు ఓట్లు దండుకోవడంలో ఉన్న శ్రద్ధ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమంపై లేకపోవడం బాధాకరమన్నారు.

February 20, 2026 / 01:26 PM IST

గుత్తిలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

ATP: గుత్తి పట్టణ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బసీనేపల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి పని నిమిత్తం గుత్తికి బైక్ మీద వచ్చాడు. బైక్ అదుపుతప్పి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 01:23 PM IST

సామాజిక న్యాయం పటిష్టంగా అమలు చేయాలంటూ నిరసనలు

SKLM: సామాజిక న్యాయం పటిష్టంగా అమలు చేయాలంటూ శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సంపద పంపిణీలో అందరికీ సమానంగా జరగాలని జిల్లా పార్టీ నాయకులు తిరుపతిరావు అన్నారు. కార్మికులకు పనిగంటలు తగ్గించి తగిన వేతనాన్ని చెల్లించాలన్నారు. సంఘాల నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 01:21 PM IST

యూరియా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు

CTR: పుంగనూరు పట్టణంలోని చంద్రకాంత్ వీధిలో యూరియా కోసం ఎండను సైతం లెక్కచేయకుండా క్యూలైన్‌లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఒక్క రైతుకు ఒక్క బస్తా యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నారు. అధికారులు సకాలంలో రైతులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

February 20, 2026 / 01:19 PM IST

అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలకు జిల్లా యువకుడు ఎంపిక

విజయనగరానికి చెందిన తెలికిచెర్ల శ్రీతోద్భవ్ షిల్లాంగ్లో ఈ నెల 23 నుండి 27 వరకు జరిగే ఇస్రో NSSS 2026 అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొనున్నారు. తాను రాసిన పరిశోధనాత్మక వ్యాసం ” సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ త్రూ కాస్మిక్ లైఫ్ విసబిలిటీ మెట్రిక్” అనే అంశంపై ఇస్రో, పలువురు అంతర్జాతీయ, అంతరిక్ష పరిశోధకులకు వివరించబోతున్నారు.

February 20, 2026 / 01:18 PM IST

పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీపీవో

VZM: జిల్లా పంచాయతీ అధికారి డి. వి.మల్లిఖార్జున శుక్రవారం కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. స్వర్ణ పంచాయతీ ఇంటి పన్నుల బకాయిలు 2025, 26 వరకు సంబంధించి రూ 1.48 లక్షలు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ 65 లక్షలు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. పంచాయతీ షాపుల అద్దెలు బకాయిలు ఉన్నాయని, త్వరలో వసూలుకు చర్యలు చేపడతామన్నారు. ఈఓపీఆర్డీ ఉన్నారు.

February 20, 2026 / 01:15 PM IST

‘వచ్చే నెల 31 లోపు దరఖాస్తులు చేసుకోవాలి’

VZM: మెరకముడిదాం మండలంలోని స్దానిక గర్భం AP మోడల్‌ స్కూల్లో 2026- 27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ అరుణకుమారి శుక్రవారం. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 24 నుంచి వచ్చే నెల 31లోపు www.apms.apcfss.in వైబ్‌ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ 12 తేదిన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

February 20, 2026 / 01:15 PM IST

‘మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి’

AKP: అచ్యుతాపురం మండలంలోని పూడిమడక జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఎస్సై సుధాకర్ విద్యార్థులకు డ్రగ్స్, మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించారు. గంజాయి వంటి నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాలని, కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. అనుమానాస్పద సమాచారం పోలీసులకు తెలియజేయాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండి, మోసాలకు గురికావద్దని హెచ్చరించారు.

February 20, 2026 / 01:08 PM IST

జిల్లా యాదమరి సమీపంలో విషాదం

CTR: యాదమరి సమీపంలో బావిలో పడి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ పోలీసు సిబ్బంది దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

February 20, 2026 / 01:08 PM IST

హైవేపై నిర్మాణ పనులు.. దుమ్ముతో ఇక్కట్లు

ASR: 516-ఈ హైవే నిర్మాణ పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జీ.మాడుగుల మండలంలో హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పలుచోట్ల మట్టి పనులు చేపట్టారు. నీళ్లతో తడపకపోవడం వల్ల దుమ్ము, ధూళి విపరీతంగా గాలిలోకి లేస్తుంది. చుట్టుపక్కల ఇళ్లలోకి, వాహనదారుల కళ్లలోకి దూరటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు.

February 20, 2026 / 01:06 PM IST

‘ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి’

CTR: వాతావరణ మారుతూ ఉందని ఈ క్రమంలో ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ మధుసూదనాచారి సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వాతావరణం పొడిగా మారిందన్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. నిల్వచేసిన ఆహారాన్ని తినటం మానుకోవాలన్నారు. జాగ్రత్తలు పాటించాలన్నారు.

February 20, 2026 / 01:05 PM IST

సీఎం చంద్రబాబుతో నెల్లూరు ఎంపీల భేటీ

NLR: అంతర్జాతీయ స్థాయిలో ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. శుక్రవారం అనంతరం ఆయనతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు.

February 20, 2026 / 01:04 PM IST