కడప జిల్లాలోని భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భూములు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్థులు ఆందోళనకు దిగగా, జీతాలు సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.
E.G: వైసీపీ శాసనమండలి సభ్యులు, మాజీ సీఎం జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారని వెంటనే వారు క్షమాపణ చెప్పాలని నిడదవోలు MLA, మంత్రి కందులు దుర్గేష్ శుక్రవారం డిమాండ్ చేశారు. శాసనమండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానిస్తూ, స్వామి వారి చిత్రపటాలు విసిరేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హిందూ దేవతలను అవమానించడమే వైసీపీ లక్ష్యం అని మంత్రి అన్నారు.
కృష్ణా: గుడివాడ లోని కార్మికానగర్, సాయినగర్, చెంచుపేట ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ మనోహర్ శుక్రవారం పర్యటించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం తాగునీటి సరఫరా వ్యవస్థను సమీక్షించి, ఎక్కడైనా లీకేజీలు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించి సరిదిద్దాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ATP: గుంతకల్‌లోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థ ఎదుట శుక్రవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం పూర్తవకముందే ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేయాలని, ఫీజుల దోపిడిని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.
అన్నమయ్య: సుగవాసి ప్రసాద్ బాబు – మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మధ్య విభేదాలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. మార్చి 2న అన్నమయ్య పార్లమెంట్ అధ్యక్షుడిగా సుగవాసి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, కార్యక్రమానికి మంత్రి హాజరవుతారా? అనే అంశం కార్యకర్తల్లో ఆసక్తి రేపుతోంది. నాయకుల మధ్య విభేదాలు పార్టీపై ప్రభావం చూపుతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
W.G: మొగల్తూరు డీసీసీబీ బ్రాంచ్ వద్ద సహకార సంఘ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం ఐదవ రోజుకు చేరుకుంది. ఉద్యోగుల జీతాల పెంపు వల్ల ప్రభుత్వానికి పైసా భారం ఉండదని, సహకార సంఘాల లాభాల నుంచే చెల్లింపులు జరుగుతాయని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.
W.G: పెనుగొండ మండలం సిద్ధాంతంలో వశిష్ఠ గోదావరి నది ఒడ్డున రూ. 3 కోట్లతో గోదావరి మోక్షధామం స్మశాన వాటిక నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజమండ్రి తర్వాత గోదావరి జిల్లాల్లో ఈ తరహా స్మశాన వాటిక నిర్మాణం ఈ ప్రాంతంలోనే జరుగుతుందని, అత్యాధునిక హంగులతో స్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
ELR: కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ ఎంపీ నిధుల నుంచి స్మశాన వాటిక అభివృద్ధికి ఇటీవల రూ. 20 లక్షలు కేటాయించారు. స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగిన అనంతరం శుక్రవారం స్మశాన వాటిక అభివృద్ధి పనులను కూటమి నాయకులు పరిశీలించారు. అలాగే పనులు చాలా నాణ్యతగా జరగాలని త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.
కర్నూలు కలెక్టరేట్‌లో JC నూరుల్ ఖమర్ నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఆయన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇళ్ల స్థలం, ఇతర ప్రయోజనాలను త్వరగా మంజూరు చేయాలని సూచించారు.
W.G: అంతర్జాతీయ మల్టీ టాలెంటెడ్ పురస్కారం, నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డ్, నంది అవార్డు అందుకున్న ఆకివీడుకు చెందిన ఘంటా షైనీని శుక్రవారం సన్మానించారు. ఆకివీడులోని స్థానిక ప్రైవేట్ స్కూల్ ఛైర్మన్ ఉండ్రమట్ల సాంబశివరావు సన్మానించి పదివేల రూపాయలు చెక్కును అందజేశారు. ఆకివీడు ఖ్యాతిని షైనీ దశదిశలా విస్తరింప చేస్తుందన్నారు.
కోనసీమ: ఈనెల 22న మంగళగిరి లో ఆదివారం జరగనున్న బీసీ సింహగర్జనను జయప్రదం చేయాలని ఆ సభకు వేలాదిగా బీసీలు తరలి వెళ్లాలని రాష్ట్ర బీసీవై ఎగ్జిక్యూటివ్ మట్ట వీరబాబు గౌడ్ బీసీలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం కొత్తపేటలో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. ఈ సభలో బీసీలకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని కోరారు.
E.G: రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మాజీ కార్పోరేటర్ రేలంగి శ్రీదేవి, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఏసు పాల్గొని ప్రజల నుంచి మంచినీటి సమస్యలు, ఫీజు రియంబర్స్‌మెంట్, పింఛన్ల తదితర సమస్యలపై వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
KDP: అలగనూరు రిజర్వాయర్ మరమ్మతు పనులు త్వరితగన పూర్తి చేయాలని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కోరారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో అలగనూరు రిజర్వాయర్ గురించి ప్రస్తావించారు. ఆరు నియోజకవర్గాల్లో 92 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉందన్నారు.
NDL: గోస్పాడు మండలంలో ఇవాళ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పర్యటించారు. నెహ్రు నగర్ గ్రామంలో వైసీపీ కార్యకర్త వివాహ వేడుకల్లో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలను తెలియజేశారు.
KKD: ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత కోటాలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని MEO గీతాదేవి సూచించారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 1వ తరగతి ప్రవేశాల కోసం ఫిబ్రవరి 20 నుంచి మార్చి 10 వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థి అన్ని పత్రాలు సమర్పించాలన్నారు.