KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరగుతున్న డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన 18 మంది విద్యార్థులను శనివారం డిబార్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. 10,263 మంది విద్యార్థులకు గాను 9,387 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు వెల్లడించారు.
CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.144 నుంచి రూ.150, మాంసం రూ.209 నుంచి 234 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.238 నుంచి రూ.260 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ.75 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
కృష్ణా: పెనమలూరు మండలం పోరంకి టీడీపీ కార్యాలయంలో 9 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చులు నిమిత్తం మంజూరైన రూ.7,63,198 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చంద్రబాబు ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
శాసనమండలలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామిని అవమానించి అపచారం చేశారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ విమర్శించారు. ఈ మేరకు అనకాపల్లి పట్టణం గాంధీనగరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు, ఆలయ సంప్రోక్షణ చేశారు. వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
TPT: సైదాపురం నుంచి రాపూరు వెళ్లే దారిలో జగనన్నా లేఅవుట్ సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై బైకుపై ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడిందా లేదా మరో వాహనం వీరిని ఢీకొట్టిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ఉదయం 8:30 కు రాష్ట్ర పండుగగా గుర్తింపు పోందిన రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో పాల్గోననున్నారు. అనంతరం 11కు చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవానికి హాజరుకానున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి.
KDP: జమ్మలమడుగు RTC డిపో నుంచి ప్రొద్దుటూరుకు 9 నాన్ స్టాప్, 3 పల్లెలకు సర్వీసులు ఉన్నాయి. ఇక ఇప్పటి నుంచి 12 సర్వీసులను పల్లె వెలుగు బస్సులు గా మారుస్తున్నట్లు డిపో మేనేజర్ సుబ్బమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈనెల 26 నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KRNL: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జరిగిన UG పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన 17 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు ఉపకులపతి వెంకట బసవరావు నిన్న తెలిపారు.సెయింట్ జోసెఫ్, YMR సిద్ధార్థ కాలేజీల్లో ముగ్గురు, శ్రీ వైష్ణవి, శ్రీ రాఘవేంద్ర, సెయింట్ జోసెఫ్ ఉమెన్, YMR జీడీసీల్లో ఇద్దరు, నంద్యాల, డోన్ జీడీసీ, ఆలూరు వెంకటేశ్వర కాలేజీల్లో ఒక్కొక్కరు ఉన్నారు.
PLD: చిలకలూరిపేట పట్టణ సమస్యలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శనివారం మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
VSP: ఆనందపురం మండలం బోయిపాలెం వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న కొట్టా అప్పారావును ఆనందపురం నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన రోడ్డుపై పడిపోవడంతో కుడి భుజం, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
GNTR: నంబూరు-ఎర్రుపాలెం నూతన రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం యార్డ్ ఆధునీకరణ, పెద్దాపురం వరకు 3.52 కిలోమీటర్ల మేర కొత్త పట్టాల ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకోసం రూ. 36.2 కోట్ల వ్యయంతో టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. ఈ అడుగుతో కొత్త రైల్వే లైన్ కల సాకారం దిశగా పనులు మరింత వేగవంతం కానున్నాయి.
BPT: వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు శనివారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు.
విజయనగరంలో నేటి చికెన్ ధరలు ఇలా ఉన్నాయి.స్థానిక మార్కెట్‌లో చికెన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. వ్యాపారుల సమాచారం ప్రకారం కేజీ బ్రాయిలర్ చికెన్ సుమారు ₹285కు, స్కిన్‌లెస్ ₹275కు, బోనెలెస్ ₹295 వరకు విక్రయించబడుతోంది. నాటు కోడి ధరలు మాత్రం ₹300 పైగా ఉన్నాయి. షాపుల ఆధారంగా ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని పేర్కొన్నారు.
W.G: భీమవరంలో భవన, ఇతర నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో అమలవుతున్న పథకాలపై అవగాహన కార్యక్రమం ఎఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. భవననిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పెండింగులో ఉన్న 46 వేల క్లెయిములను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన కార్మికశాఖ ఉప కమిషనర్ పి.శ్రీనివాస్‌కు యూనియన్ తరఫున వినతిపత్రం అందజేశారు.
ATP: జిల్లాలో ఈనెల 23 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ఆర్ఐవో వెంకట రమణనాయక్ తెలిపారు. మొత్తం 64 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఉదయం 8.15 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరంలో 24,568 మంది, ద్వితీయ సంవత్సరంలో 23,578 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.