Lokesh Padayatra : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయం గా కొనసాగుతోంది. యువగళం పేరిట ఆయన చేపట్టిన యాత్ర 300 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. దీంతో... తొండమానుపురంర గ్రామంలో లోకేష్ ఈ సందర్భంగా శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు.
pattabi:టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షం అయ్యారు. నిన్నటి ఉద్రిక్తత తర్వాత.. పోలీసులు ఆయనను పీఎస్‌కు తీసుకొచ్చారు. ఆయన ఆచూకీ తెలియడం లేదని.. ఆయన భార్య.. టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు.
గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu) స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఆయన డీజీపీకి (dgp) లేఖ (letter) రాశారు. అధికార వైసీపీ శ్రేణుల తీరును తప్పుపట్టారు. వైసీపీ గూండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు కనబడుతుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ (Suryakumar) సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నరు. తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సూర్యకుమార్ యాదవ్ దంపతులను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.
గవర్నర్ కు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో గవర్నర్ మూడున్నరేళ్ల కాలాన్ని ఒకసారి నెమరు వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇకపై తనకు రెండో ఇల్లు లాంటిదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) లో అప్పడే ఎన్నికల వేడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah) జోస్యం చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ (Pawan Kalyan) బస్సు యాత్రకు ముందు, బస్సు యాత్రకు తరువాత అంటూ రెండు రకాల సర్వే ఫలితాలను ఆయన సోషల్ మీడియా
(Social media )లో పోస్టు చేశారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాదం ఐరన్ లెగ్ అని, మోసం చేసి బ్రతకటం మాత్రమే తెలుసునని మంత్రి గోవర్థన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
kanna laxmi narayana:ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (jagan) సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే అరాచక పాలన ప్రారంభించారని మండిపడ్డారు. ఆయనకు పోలీసులు (police) కూడా తోడయ్యారని విమర్శించారు.
YS Bharathi : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి... ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా..? వచ్చే ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే... అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.
శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి (Mallikarjunaswamy) ఆలయ ఈవో ఎస్.లవన్న (e.o lavanna) మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పాదాభివందనం చేయడం విమర్శలకు దారితీసింది. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం మంత్రి పెద్దిరెడ్డి (piddireddy)ఆలయం వద్దకు చేరుకున్నారు.
గన్నవరం(gannavaram) టీడీపీ కార్యాలయంపై (Telugudesam) కొందరు దుండగులు చేసిన దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఎమ్మెల్యే వల్లభనేని అనుచరులు, వైసీపీ వర్గీయులు రణరంగం సృష్టించారు. సోమవారం సాయంత్రం తెలుగు దేశం పార్టీ కార్యాలయం పైన కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇష్టారీతిన దాడులు చేయడంతో పలువురు కార్యకర్తలతో పాటు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి అరెస్ట్ చేశారు. ఈ అంశం పైన పట్టాభిరామ్ భార్య చందన మీడియా ముందుకు వచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అధికారులు దూకుడు పెంచారనే చెప్పవచ్చు. దర్యాప్తును వేగవంతం చేస్తూ క్రమంగా పలువురిని అరెస్ట్ చేసి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అరెస్టైన ఏపీ వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని తీహార్ జైలుకు తీసుకెళ్లారు. రాఘవకు విధించిన కస్టడీ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
మంచి బాడీ షేప్స్, కండలు తిరిగిన మజిల్స్, సిక్స్ ప్యాక్ కోసం యువకులు ఎక్కువగా జిమ్ సప్లిమెంట్లను వాడుతూ ఉంటారు. అయితే వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ 22 ఏళ్ల యువకుడు దీర్ఘకాలంగా జిమ్ సప్లిమెంట్స్ వాడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్నాడు.