»Cm Jagan Gives Farewell To Governor Biswabhusan Harichandan
Farewell: సీఎం జగన్ వీడ్కోలు.. భావోద్వేగానికి లోనైన గవర్నర్ బిశ్వభూషణ్
గవర్నర్ కు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో గవర్నర్ మూడున్నరేళ్ల కాలాన్ని ఒకసారి నెమరు వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇకపై తనకు రెండో ఇల్లు లాంటిదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గవర్నర్ (Governor) బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan) భావోద్వేగానికి లోనయ్యారు. మూడున్నర సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా వ్యవహరించిన ఆయన చత్తీస్ గఢ్ (Chhattisgarh)కు బదిలీపై వెళ్తున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గవర్నర్ కు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో గవర్నర్ మూడున్నరేళ్ల కాలాన్ని ఒకసారి నెమరు వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇకపై తనకు రెండో ఇల్లు లాంటిదని పేర్కొన్నారు.
విజయవాడ (Vijayawad)లోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ కు సీఎం జగన్ సత్కరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ. ‘గవర్నర్, ముఖ్యమంత్రి సంబంధాలు ఎంతో ముఖ్యమైనవి. సీఎం జగన్ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. సీఎం జగన్ ను నా కుటుంబసభ్యుడిగా భావిస్తున్నా. ప్రజలు అందించిన ప్రేమ, అభిమానం, సహకారం అద్భుతమైనది. ఏపీ ప్రజలను ఎప్పటికీ మరువను. కరోనా కాలంలో వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు ప్రాణాలకు తెగించి సేవలు అందించారు. ఏపీ నా రెండో ఇల్లు’ అని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు.
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘ఒక తండ్రిలా, పెద్దలా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి గవర్నర్ బిశ్వభూషణ్ అండగా నిలిచారు. గవర్నర్ తో నాకున్న తీపి గుర్తులు ఎప్పటికీ మరువలేను. గవర్నర్ విద్యావేత్త, న్యాయ నిపుణులు, స్వాతంత్ర్య సమరయోధుడు అని మరోసారి గుర్తు చేస్తున్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒడిశా బార్ అసోసియేషన్ లో కీలకంగా పని చేశారు. బిశ్వభూషణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యలతో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నా. భిశ్వభూషణ్ హరిచందన్ కు ప్రజలు, ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు’ అంటూ ప్రసంగం ముగించారు. కాగా ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు.