»Pattabiram Is Sat On The Gannavaram Police Station
pattabi in gannavaram ps:గన్నవరం పీఎస్లో పట్టాభిరామ్, ఉత్కంఠకు తెర
pattabi:టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గన్నవరం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం అయ్యారు. నిన్నటి ఉద్రిక్తత తర్వాత.. పోలీసులు ఆయనను పీఎస్కు తీసుకొచ్చారు. ఆయన ఆచూకీ తెలియడం లేదని.. ఆయన భార్య.. టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు.
pattabi:టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (pattabi) గన్నవరం పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం అయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి తర్వాత ఆయన అక్కడికి వచ్చారు. అయితే పోలీసులు ఆయనను అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారనే అంశంపై సమాచారం ఇవ్వలేదు. దీంతో ఆయన భార్య.. టీడీపీ శ్రేణులు (tdp workers) ఆందోళనకు గురయ్యారు.
పట్టాభి (pattabi) కనిపించడం లేదని నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏకంగా డీజీపీకి (dgp) లేఖ రాశారు. దీంతో పోలీసులు పట్టాభిని (pattabi) గన్నవరం పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చారు. అందుకు సంబంధించి ఫోటోను మీడియాకు విడుదల చేశారు. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారట.
నిన్న గన్నవరంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల తర్వాత పోలీస్ స్టేషన్ వచ్చిన పట్టాభిని (pattabi) పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. గన్నవరంలో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. పట్టాభిని (pattabi) అరెస్ట్ చేసి..వాహనంలో మరో ప్రాంతానికి తరలించారు. పట్టాభి ఫోన్ స్విచాఫ్ అని వస్తుండడంతో, ఆయనను ఎక్కడికి తరలించారనే విషయంపై స్పష్టత లేదు.
ఓ క్రమంలో వీరవల్లికి తరలిస్తున్నారని తెలిసింది. తర్వాత హనుమాన్ జంక్షన్ కు తరలిస్తున్నారని ప్రచారం జరిగింది. తన భర్త ఆచూకీ తెలియడం లేదని పట్టాభి (pattabi) భార్య చందన (chandana) మీడియా ముందుకు వచ్చారు. ఆచూకీ తెలియజేయాలని కోరారు. దీంతో పట్టాభిని (pattabi) పీఎస్ వద్దకు తీసుకొచ్చారు. నిజానికి గన్నవరం టీడీపీ కార్యాలయం వద్ద బీభత్సం చేసింది వంశీ (vamsi) అనుచరులు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు వెళ్లిన పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నటి నుంచి వాహనంలో తిప్పి.. ఈ రోజు మీడియాకు చూపించారు.