»Kanna Laxminarayana Slams Andhra Pradesh Cm Ys Jagan
kanna laxmi narayana:అధికారం శాశ్వతం కాదు జగన్, ప్రజలు తిరగబడితే ఇక అంతే సంగతులు
kanna laxmi narayana:ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (jagan) సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే అరాచక పాలన ప్రారంభించారని మండిపడ్డారు. ఆయనకు పోలీసులు (police) కూడా తోడయ్యారని విమర్శించారు.
kanna laxmi narayana:ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై (jagan) సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే అరాచక పాలన ప్రారంభించారని మండిపడ్డారు. ఆయనకు పోలీసులు (police) కూడా తోడయ్యారని విమర్శించారు. అరాచకాలు చేస్తున్న వారిని వదిలేసి.. పోరాటం చేసే వారిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తనపై జగన్ మీడియా అసత్య ప్రచారం చేయడానికి సిద్దంగా ఉందని ఆరోపించారు.
కొద్దిరోజులే
అధికారం శాశ్వతం కాదని సీఎం జగన్ (cm jagan) గుర్తుంచుకుంటే మేలు అని అభిప్రాయపడ్డారు. జనం తిరగబడిన రోజు.. ఎవరు తోడు ఉండరని హెచ్చరించారు. గత ముఖ్యమంత్రులు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. సీఎం జగన్ (jagan) మాత్రం ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
పోలీసులు పట్టించుకోకుంటే..?
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిని కన్నా లక్ష్మీనారాయణ (kanna laxmi narayana) ఖండించారు. రాష్ట్రంలో అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయిస్తాం.. పోలీసులే పట్టించుకోకుంటే ఎవరి వద్దకెళ్లాలని ప్రశ్నించారు. టీడీపీ నేత పట్టాభిని (pattabi) ఎక్కడ దాచారో తెలుపాలని డిమాండ్ చేశారు. పట్టాభి తప్పు చేసి ఉంటే కోర్టులో ప్రవేశపెట్టాలని కోరారు. ఎక్కడున్నారో చెప్పాల్సిన బాధ్యత డీజీపీపై (dgp) ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగే అరాచకాలకు స్వస్తి పలకాలని డీజీపీకి సూచించారు. ఈ నెల 23వ తేదీన చంద్రబాబు నాయుడు (chandrababu naidu) సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని ఉద్ఘాటించారు. తనతో అనుచరులు కూడా వెంట వస్తారని పేర్కొన్నారు.
చదవండి:kanna laxmi narayana:టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ.. మంత్రి పదవీ?
బాబుతోనే అభివృద్ధి
చంద్రబాబు నాయుడు (chandrababu) నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి అవుతుందని కన్నా (kanna laxmi narayana) అనుచరులు భావించారు. రాజధాని అమరావతి నిర్మాణం అవుతుందని అంటున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించగల సమర్థుడు కావాలని, అందుకు చంద్రబాబే సరైన వ్యక్తి అని వారంతా అభిప్రాయపడ్డారు. కార్యకర్తల అభీష్టం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరాలని కన్నా లక్ష్మీనారాయణ (kanna laxmi narayana) నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం గుంటూరు కన్నావారి తోటలో గల నివాసం నుంచి మద్దతుదారులతో కలిసి ర్యాలీగా బయల్దేరతారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళతారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతారు. టీడీపీలో మంచి ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు.. కన్నా లక్ష్మీనారాయణకు భరోసా ఇచ్చినట్టు తెలిసింది.
కన్నా చేరికకు కారణమిదే?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే కాపు కోటాలో సీనియర్ రాజకీయ నేతకు మంత్రి పదవీ దక్కుతుంది. అందుకే కన్నా లక్ష్మీనారాయణ (kanna laxmi narayana) టీడీపీలో చేరనున్నారని మరికొందరు అంటారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే సునాయాసంగా అధికారం దక్కించుకోవచ్చని ఆయన భావించారు. బీజేపీలో జీవీఎల్ ప్రవర్తన బాగోలేదని కన్నా లక్ష్మీనారాయణ ఇదివరకే మండిపడ్డారు. వంగవీటి రంగా పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని గతంలో తాము ఉద్యమం చేశామని గుర్తుచేశారు. ఆ ఉద్యమంలో జీవీఎల్ పాల్గొంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కొందరు రాత్రికి రాత్రే స్టార్లు అయిపోదాం అనుకుంటున్నారని జీవీఎల్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. ఆ వెంటనే పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు.