»Ramya Neerukonda Attachments0736 3 Hours Ago To Hittv Me Hittvtelugu6 Translate Message Turn Off For Telugu Ys Jagan Wife Bharathi May Enter Into Politics
YS Bharathi : రాజకీయాల్లోకి వైఎస్ భారతి..?
YS Bharathi : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి... ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా..? వచ్చే ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే... అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి… ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా..? వచ్చే ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే… అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది.
జమ్మలమడుగు నియోజకవర్గం పూర్తి ఆధిపత్యాన్ని దక్కించుకోవడానికి ఆ నియోజకవర్గం నుంచి భారతి ని పోటీ కి దింపాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడి నుంచి వైఎస్ కుటుంబం మద్దతిచ్చిన అభ్యర్ధులు గెలిచినా మధ్యలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2019లో మాత్రం వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ సుధీర్ రెడ్డి గెలిచారు.
అయినా జమ్మలమడుగుపై వైసీపీ పూర్తి ఆధిపత్యం లేదు, ఈసారి టీడీపీ అభ్యర్ధిగా ఆదినారాయణరెడ్డి నిలిచే అవకాశం ఉందన్న అంచనాలు, మరోవైపు వైసీపీలోనే ఉన్న రామసుబ్బారెడ్డి నుంచి ఎదురయ్యే ప్రతిఘటన విషయంలో ఆలోచనలో పడ్డ జగన్ రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ సీటిచ్చేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.
జమ్మలమడుగు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపైనా వ్యతిరేకత పెరుగుతోన్న క్రమంలో ఆయన స్ధానంలో ఈసారి ఎన్నికల్లో తన సతీమణి వైఎస్ భారతిని ఎమ్మెల్యేగా బరిలోకి దించాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారతిని బరిలోకి దింపడం ద్వారా ఈ సీటును కూడా తమ కంచుకోటగా మార్చుకోవడంతో పాటు ఇక్కడ కడప స్టీల్ ప్లాంట్ కు ఎలాంటి ఇబ్పందులు లేకుండా చూసుకోవాలని కూడా జగన్ భావిస్తున్నట్లు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలా చేసి సుధీర్ రెడ్డికి మరో పదవి ఇచ్చి, రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చేలా జగన్ స్కెచ్ సిద్ధం చేశారని, వేరే ఎవరికైనా సీటు ఇస్తే ఇబ్బంది కానీ వైఎస్ జగన్ భార్య అంటే వారు కూడా మాట్లాడరు ఆయన యోచిస్తున్నారు.
ఇక ఎన్నికల ముందు ఎన్డీయే సర్కార్ పై వైసీపీ సమరశంఖం పూరించడం ఖాయమని అలా చేస్తే జరిగితే జగన్ తో పాటు వైసీపీపై సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్ధలు విరుచుకుపడటం ఖాయమని అంటున్నారు. వివేకా కేసుతో పాటు జగన్ కేసుల్లోనూ ఈ రెండు సంస్ధలు దూకుడు పెంచితే ఇబ్బందులు తప్పవనే అంచనాతో అప్పుడు వైఎస్ భారతి ఎమ్మెల్యేగా ఉంటే జగన్ స్ధానంలో సీఎంగా కూడా మార్చుకునే వెసులుబాటు లభిస్తుందని అంటున్నారు. ఇప్పుడు జగన్ కుటుంబసభ్యుల్లో సీఎం పదవి ఇచ్చే పరిస్ధితి ఎవరికీ లేదు కాబట్టి భారతిని ఆ దిశగా సిద్ధం చేస్తున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.