• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మహిళ చెవి కోసి నగలు అపహరణ..!

CTR: గంటవూరు సమీపంలోని శనీశ్వరాలయం వద్ద ఉన్న ఓ దుకాణంలో దొంగ బీభత్సం సృష్టించాడు. బైక్‌పై హెల్మెట్, మాస్కుతో వచ్చిన అగంతకుడు షాపులో సిగరెట్ కావాలని అడిగి, యజమాని జ్యోతి మెడలోని గొలుసు లాగేందుకు ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో దొంగ ఆమె చెవిని తుంచి కమ్మలు, మాటీలు (14గ్రా) లాక్కెళ్లాడు. తీవ్ర రక్తశ్రావమైన బాధితురాలికి ఐదు కుట్లు పడ్డాయి.

February 23, 2026 / 06:32 AM IST

ఇంటర్ విద్యార్థులకు SP తీపికబురు

ELR: ఇంటర్ విద్యార్థులకు SP ప్రతాప్ శివ కిషోర్ తీపి కబురు చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రానికి వెళ్లడానికి ఆలస్యం అవుతుంటే ఏలూరులోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ఫైర్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పోలీసు వాహనాలు పరీక్షా కేంద్రానికి తరలించడానికి సిద్ధంగా ఉంటాయన్నారు.

February 23, 2026 / 06:29 AM IST

6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

AKP: చీడికాడ మండలం మంచాల మోడల్ స్కూల్‌లో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్.వెంకటలక్ష్మి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025-26లో 5వ తరగతి చదువుతున్న వారు అర్హులని పేర్కొన్నారు. మార్చి 31లోగా దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపించాలని కోరారు. ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.

February 23, 2026 / 06:28 AM IST

పే స్కేలు అమలు చేయాలని వినతి

GNTR: IERP స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి రెగ్యులర్ ఉపాధ్యా యులుగా గుర్తించి పే స్కేలు అమలు చేయాలని NTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనిగల హైమారావు డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నివాసంలో కలిసి NTA సభ్యత్వం అందజేసి, వినతిపత్రం అందించారు.

February 23, 2026 / 06:24 AM IST

వలసబాట పట్టిన పల్లె ప్రజలు

KRNL: బతుకుతెరువుకోసం కూలీలు వలసబాట పట్టారు. నందవరం నాగలదిన్నె గ్రామానికి చెందిన 50 మంది ఆదివారం రాత్రి రెండు బొలేరో వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించక గుంటూరు మిర్చి కోతలకు వలసలు వెళ్తున్నామన్నారు. గత మూడు రోజుల్లో ఆరు వాహనాల్లో 200 మంది వలసల వెళ్లారని గ్రామస్తులు తెలిపారు.

February 23, 2026 / 06:22 AM IST

విజయవాడలో ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు ప్రణాళికలు

NTR: విజయవాడ రాజీవ్ పార్క్ నుంచి గంగూరు కూడలి వరకు 14KM పొడవున ఆరు వరుసల ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రభుత్వం రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. ఒకే ఎలివేటెడ్ మార్గంగా నిర్మించాలా లేక కనకదుర్గ వారధి–BENZ సర్కిల్, BENZ సర్కిల్–గంగూరు వరకు రెండు భాగాలుగా నిర్మించాలా అనే అంశంపై చర్చ సాగుతోంది. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద భూ సేకరణ జరగనుందని అధికారులు తెలిపారు.

February 23, 2026 / 06:20 AM IST

విద్యుత్ సంస్థలపై నేడు డయల్ యువర్ సీఎండీ

VSP: విద్యుత్ సమస్యలపై సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ పృథ్వీ రాజ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ పరిధిలో శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు 11 జిల్లాలకు చెందిన వినియోగదారులు 8688400499 నెంబర్‌కు ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయాలన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

February 23, 2026 / 06:19 AM IST

జిల్లా వ్యాప్తంగా న్యాయవాదుల విధుల బహిష్కరణ

KRNL: కర్నూలు నాలుగవ పట్టణ సీఐ విక్రమ్ సింహా న్యాయవాది పవన్‌పై దాడి చేసిన ఘటనకు నిరసనగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరించనున్నారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. సీఐపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.

February 23, 2026 / 06:19 AM IST

వైసీపీ అపహస్య ప్రవర్తన సరికాదు: రామరాజు

W.G: భీమవరం జిల్లా టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు మాట్లాడుతూ.. గత 5 సంవత్సరాల్లో తిరుమల లడ్డూలు కల్తీ జరగలేదని వైసీపీ నాయకులు అనడం లేదని అన్నారు. పూర్తిస్థాయిలో కల్తీ జరిగిందని అన్నారు. మాజీ సీఎం గుడికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ కూడా ఇవ్వరని విమర్శించారు.

February 23, 2026 / 06:18 AM IST

వృత్తి పట్ల అంకితభావంతో పని చేయాలి: MLA

KRNL: ప్రభుత్వం తరఫున ఏజీపీగా నియమించడంతో నిబద్ధతతో ప్రజలు, ప్రభుత్వానికి సేవలు అందించాలని MLA బీవీ జయనాగేశ్వరరెడ్డి సూచించారు. ఏజీపీగా ఎంపికైన రషీదుల్లా, న్యాయవాదులు ఆదివారం MLA బీవీని సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వృత్తి పట్ల అంకితభావంతో పని చేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైనప్పుడుల్లా సేవలు అందించి మన్ననలు పొందాలన్నారు.

February 23, 2026 / 06:15 AM IST

అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు

W.G: వేములదీవికి చెందిన లక్ష్మీ భవానీకి, కొత్తోట చెందిన కొపనాతి మణికంఠ నాగరాజుతో 2020 మే 13న వివాహం జరిగింది. లక్ష్మి భవానిని అదనపు కట్నం తేవాలని అత్త సత్యవతి, మామ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 23న వారంతా కలిసి లక్ష్మిపై దాడి చేసి, అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధించారు. బాధితురాలు లక్ష్మి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

February 23, 2026 / 06:14 AM IST

పేకాట స్థావరంపై దాడి.. ముగ్గురు అరెస్ట్

కృష్ణా: కొడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉల్లిపాలెంలో పోలీసులు ఆదివారం మెరుపు దాడులు నిర్వహించారు. జూదం జరుగుతున్నదన్న సమాచారంతో SI కె. చాణక్య ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,070ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

February 23, 2026 / 06:13 AM IST

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్

AKP: జిల్లాలో 34 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఐఈఓ ఎం.వినోద్ బాబు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సోమవారం జరిగే మొదటి సంవత్సరం పరీక్షలకు 13,153 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో గల అన్ని రూమ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసామన్నారు.

February 23, 2026 / 06:11 AM IST

నేడు విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో PGRS

VSP: సిటీ పోలీస్ కమిషనరేట్‌లో ప్రతి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్‌కు విన్నవించుకోవచ్చు. అందిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుని పరిష్కారం చూపిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల సమస్యలకు తక్షణ స్పందనకోసమే అని చెప్పారు.

February 23, 2026 / 06:09 AM IST

కోడుమూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

KRNL: కోడుమూరు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారుడు షేక్ షాకీర్, అతని భార్య షేక్ సలీమాకు ఆదివారం కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి రూ. 4,95,699/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. పసుపుల ఎమ్మెల్యే నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో, సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు CM చంద్రబాబు , KDCC ఛైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

February 23, 2026 / 06:07 AM IST