• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కుప్పాలపల్లిలో పోలీసుల ‘పల్లె నిద్ర’ కార్యక్రమం

KDP: వేంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్పాలపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని ఎస్సై తిరుపాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి సైబర్ మోసాలు, చట్టాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, అనుమానాస్పద కాల్స్‌పై 1930కు సమాచారం ఇవ్వాలని కోరారు.

February 23, 2026 / 04:14 AM IST

మహిళలకు నారీ శక్తిపై అవగాహన

SKLM: పలాస మండలం మహాదేవిపురంలో ఆదివారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్‌పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి మహిళ తమ సెల్‌ఫోన్‌లో నారి శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు.

February 22, 2026 / 10:01 PM IST

దారుణం..యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

కాశినాయన మండలం గంగనపల్లెకు చెందిన దిలీప్(24) అనే వ్యక్తిపై దుండగులు ఆదివారం పెట్రోల్ పోసి నిప్పంటించారు.గాయపడిన యువకుడిని స్థానికులు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 09:41 PM IST

మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై జనసేన ఇంఛార్జ్ స్పందన

అన్నమయ్య: తంబళ్లపల్లి మొలకలచెరువులో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై జనసేన ఇన్‌చార్జ్ పోతుల సాయినాథ్ ఆదివారం స్పందించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, తప్పు జరిగితే శిక్ష తప్పదని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితం బాలిక బాబాయి తనను సంప్రదించిన విషయం నిజమేనని, అప్పట్లో మందలించామని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

February 22, 2026 / 09:10 PM IST

మంచి మనసు చాటుకున్న మంత్రి సవిత

సత్యసాయి: రొద్దం మండలం కోగిర గ్రామానికి చెందిన ప్రశాంతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి సవిత తక్షణమే స్పందించారు. బాధితురాలి వైద్య ఖర్చుల నిమిత్తం ఆదివారం రూ. 25,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని భరోసా కల్పించారు.

February 22, 2026 / 09:00 PM IST

పలు లాడ్జీలను తనిఖీ చేసిన సీఐ

VZM: బొబ్బిలి గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధి రామభద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పలు లాడ్జీలను సీఐ ఎస్.శ్రీనివాస్, సిబ్బందితో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని నిర్వాహకులను హెచ్చరించారు. ఖచ్చితమైన ఆధారాలు తీసుకొని ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పద వస్తువులు ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు.

February 22, 2026 / 08:59 PM IST

పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ

ASR: పీఎం ఉష పథకంలో భాగంగా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు పుట్టగొడుగుల పెంపకంపై 15 రోజుల పాటు ఇచ్చిన శిక్షణ ఆదివారంతో ముగిసిందని ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి తెలిపారు. సీఎంఎస్ లేబొరేటరీస్, పీఎం ఉష కోఆర్డినేటర్ డాక్టర్ టీఎన్ రసూల్ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారన్నారు. మొదటి బ్యాచ్ గా 30 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామన్నారు.

February 22, 2026 / 08:58 PM IST

ఇర్రిపాక జంక్షన్లో తప్పిన పెను ప్రమాదం

KKD: జగ్గంపేట మండలం ఇర్రిపాక – మర్రిపాక రోడ్డు జంక్షన్లో ఆదివారం సాయంత్రం ధాన్యం లోడుతో వెళ్తున్న ఐసర్ వ్యాన్ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. భారీ గోతులే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

February 22, 2026 / 08:53 PM IST

ఈ నెల 23న ప్రజా సమస్యల పరిష్కార వేదిక

కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో ఈనెల 23వ తేదీన సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాలాజీ ఆదివారం తెలిపారు. కావున ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

February 22, 2026 / 08:47 PM IST

బాల్య వివాహాలపై అవగాహన

PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి, శక్తి టీం నోడల్ అధికారి ఏఎస్పీ మనీషా రెడ్డి ఆదేశాల ప్రకారం పాలకొండ సచివాలయం మహిళ పోలీసు, బాల్య వివాహం నిరోధంపై మైనర్ బాలిక తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు చట్టప్రకారం నిర్వహించాలని సూచించారు. చిన్న వయస్సులో వివాహాలు చేస్తే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. అలాగే చదువుపై దృష్టి సారించాలన్నారు.

February 22, 2026 / 08:41 PM IST

జవాన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

SKLM: నరసన్నపేట చిక్కాలవలసకి చెందిన ఆర్మీ జవాన్ అమృత్ కుమార్ విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆదివారం జవాన్ పార్థివదేహానికి ఎమ్మెల్యే రమణమూర్తి నివాళులర్పించి,కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దేశానికి సేవ చేసిన ఈ వీరజవాన్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేము అని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు.

February 22, 2026 / 08:41 PM IST

గోవా గవర్నర్‌తో మంత్రి భేటీ

VZM: గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయనగరం పట్టణంలోని అశోక్ బంగ్లాలో ఆదివారం సాయంత్రం గవర్నర్‌తో మంత్రి శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి పలు అంశాలపై ఇద్దరు చర్చించారు.

February 22, 2026 / 08:39 PM IST

రేపు యధావిధిగా ఏలూరులో పీజీఆర్ఎస్

ఏలూరు: కలెక్టరేట్ కార్యాలయంలో మరియు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నమన్నారు.

February 22, 2026 / 08:36 PM IST

ఎంపీకి అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం

TPT: సత్యవేడు(మం), ఇరుగుళంలో యువత, గ్రామస్తులు ఎంపీ మద్దెల గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్చి 3న నిర్వహించనున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రిక అందించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి సానుకూలంగా స్పందించిన ఎంపీకి గ్రామస్తులు, స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

February 22, 2026 / 08:33 PM IST

రేపు అన్ని చోట్ల పీజీఆర్ఎస్: కలెక్టర్

NDL: జిల్లా కలెక్టరేట్ తో పాటు మండల డివిజన్ కేంద్రాలు మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంటుందని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజలు ఉత్తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా ఆన్ లైన్‌ ద్వారా కూడా సమర్పించవచ్చున్నారు.

February 22, 2026 / 08:30 PM IST