SKLM: జిల్లా పోలీస్ కార్యాలయంలో మీ కోసం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సోమవారం నిర్వహించారు. ఈ మేరకు భూ తగాదాలకు సంబంధించి, కుటుంబ కలహాలకు సంబంధించి, మోసాలకు పాల్పడినట్లు, ఇతర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 56 అర్జీలను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. వినతులను త్వరగా పరిష్కరించాలని పోలీసులను ఆదేశించారు.
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మార్చి 26న అంకురార్పణ, మార్చి 27న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈవో శ్రీ వీ. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సదుపాయాలు, పార్కింగ్, రవాణా, తదితర ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని సూచించారు.
GNTR: రాష్ట్రంలోని అన్ని శాఖలు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సమర్థత పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్‌పై క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ 80 నుంచి 90 శాతం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
NLR: బుచ్చి పట్టణంలోని రేబాల కాలువ చెత్తాచెదారంతో నిండిపోయి దుర్గంధమైన వాసన వస్తుందని బీజేపీ నాయకులు నగర కమిషనర్ బాలకృష్ణకు తెలియజేశారు. పలు సమస్యలపై జిల్లా ఉపాధ్యక్షులు కాసా శ్రీనివాసులు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కాలువలో నీళ్లు ప్రవహించే విధంగా చెత్తను తొలగించాలన్నారు. మలిదేవి బ్రిడ్జి వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.
కృష్ణా: ప్రజల నుంచి అందే ‘మీకోసం’ అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో సకాలంలో పరిష్కరించాలని JC ఎం. నవీన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 122 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖలు సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
ప్రకాశం: దర్శి వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం వంటి అంశాల గురించి వారితో చర్చించారు. గ్రామస్థాయి నుండి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
NDL: కొత్తపల్లి గ్రామ సమీపంలో నంద్యాల -ఆత్మకూరు రహదారిపై సోమవారం ఆర్టీసీ బస్సు పల్సర్ బైక్‌ను ఢీకొనడంతో విశ్వ నగర్‌కు చెందిన నాగరాజు(43) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మకూరు వైపు వేగంగా వెళ్తున్న బస్సు బైక్ను ఢీకొట్టిందని తాలూకా పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: గుడిపాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ప్రసాద్ సిబ్బందితో కలిసి జూదంపై దాడి నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, మరో ముగ్గురు పరారైనట్లు తెలిపారు. ఘటనాస్థలంలో రూ. 4,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. అందరూ రామాపురం గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
VZM: రబీ సీజన్ 2025-26కు జిల్లాలో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు అవసరమైన యూరియాలో ఎక్కువ భాగం సరఫరా కాగా, 5,398 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని చెప్పారు. రబీ సీజన్‌లో ఎటువంటి కొరత ఉండదని స్పష్టం చేశారు. రైతులు మట్టిపరీక్ష ఆధారంగా సమతుల ఎరువులు వినియోగించాలని సూచించారు.
AKP: గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎస్ రాయవరం ఎంపీడీవో మీనా కుమారి డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇంటి పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈనెల 15వ తేదీలోగా శత శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
AKP: మహిళ సాధికారత వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు పాల్గొంటున్నారు. మహిళలు బాలికలపై జరుగుతున్న అత్యాచారాల నియంత్రణలో పోలీసుల పాత్ర అంశంపై పోటీలు నిర్వహించారు.
సత్యసాయి: హిందూపురం విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా 33ఏళ్లు సేవలందించి పదవీ విరమణ పొందుతున్న శ్రీనివాసులు సేవలు అభినందనీయమని మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు. శ్రీనివాసులు వృత్తిని దైవంగా భావించి నీతి, నిజాయితీగా పని చేశారని కొనియాడారు. అనంతరం ఆయనను సన్మానించారు.
విశాఖలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్‌కి 272 మంది ఫిర్యాదులు చేశారని అధికారులు తెలిపారు. ఫిర్యా దులను స్వయంగా కలెక్టర్ హరేంధీర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి బాధితుల నుంచి స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ క్రింది స్థాయి అధికారులను ఆదేశించారు.
కోనసీమ: రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో ఉన్న పంచారామ పుణ్యక్షేత్రం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారిని సోమవారం విశాఖపట్నం ట్రాన్స్ కో విజిలెన్స్ ఎస్పీ కింజరపు రామకృష్ణ ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికి, ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.
KRNL: నగరపాలక సేవలు ప్రజలకు సులభంగా అందేలా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కమిషనర్ పీ.విశ్వనాథ్ అన్నారు. సోమవారం ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కాలనీలకు సంబంధించి 19 ఫిర్యాదులను స్వీకరించిన కమిషనర్, సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.