ATP: అనంతపురం రూరల్ మండలంలోని ఆలమూరు చెరువుకు హంద్రీ-నీవా నీరు చేరి మరువపారడంతో ఎమ్మెల్యే పరిటాల సునీత గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చెరువులో గంగపూజ నిర్వహించి జలహారతి ఇచ్చి గంగమ్మతల్లికి సారె సమర్పించారు. వైసీపీ దుష్ప్రచారం తప్పని, ఇప్పుడు చెరువులన్నీ నీటితో నిండుతున్నాయని పేర్కొన్నారు.
W.G: త్రిసభ్య కమిటీ ఛైర్మన్లకు ఏ సమస్య వచ్చినా తాను ముందుంటానని జిల్లా త్రిసభ్య కమిటీ నూతన ఛైర్మన్, భీమవరం వ్యవసాయం మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు అన్నారు. ఇవాళ కార్తీక మాసం పురస్కరించుకొని జిల్లాలో ఉన్న ఏఎంసీ ఛైర్మన్ల ఆత్మీయ సమావేశం భీమవరం AMCలో నిర్వహించినట్లు తెలిపారు.
PPM: పార్వతీపురంలో నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ భవన ఆవరణలో ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్‌కు గిరిజన సంక్షేమ శాఖామాత్యులు గుమ్మిడి సంధ్యారాణి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రూ. 60,00 లక్షల అంచనా విలువతో ఈరోజు పార్వతీపురం జిల్లా కేంద్రంలో వన్ స్టాప్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
KDP: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. జిల్లా ఎస్పీ నచికేత్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయరాదని వాగులు, వంకలు దాటరాదని సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
అన్నమయ్య: మదనపల్లెలో టమాటా ధరల్లో కదలిక వచ్చిందని వ్యవసాయ మార్కెట్ కమిటి సెక్రటరీ జగదీశ్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వారం రోజులుగా మార్కెట్లోకి 135 మెట్రిక్ టన్నుల నుంచి 70 మెట్రిక్ టన్నులకు టమాటాల దిగుబడి తగ్గిపోయిందన్నారు. దీంతో బుధవారం పది కిలోల మొదటి రకం టమాటా బాక్స్ రూ. 520 వరకు పలకగా.. రెండో రకం రూ. 480, మూడో రకం రూ.400 వరకు పలికిందన్నారు.
సత్యసాయి: కదిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం నియోజకవర్గంలోని రాజకీయ అంశాలను అధినేత దృష్టికి తీసుకెళ్లారు. కోటి సంతకాల కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నామని పేర్కొన్నారు.
అన్నమయ్య: వీరబల్లి మండలం సానిపాయ కృష్ణమయ్య గారి పల్లెలో బుధవారం మధ్యాహ్నం ఇంటి విషయంలో అన్నదమ్ములైన చిన్నప్ప, వెంకటయ్యల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గతంలో వీరబల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సమక్షంలో పంచాయితీ జరిగినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.
GNTR: తెనాలి-దుగ్గిరాల మార్గంలో చింతలపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 65 ఏళ్ల గుర్తు తెలియని వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై పడి ఉన్న అతన్ని గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇచ్చి తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. వృద్ధుడు మోపెడ్‌పై వెళుతుండగా అదుపుతప్పి ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.
CTR: నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలకు చిత్తూరు జిల్లాలోని రేపు(గురువారం) అన్ని విద్య సంస్థలకు సెలవు ప్రకటిస్తూ.. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ముందస్తు చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్క స్కూలు యాజమాన్యం ఈ నింబధనలు పాటించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
AKP: జిల్లాలో షెడ్యూల్ ప్రకారం రీసర్వే పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ జాహ్నవి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండవ విడత 30 గ్రామాల్లో రీసర్వే జరుగుతున్నట్లు తెలిపారు. 80 సర్వే బృందాలు రీసర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
E.G: యువత క్రీడల పై ఆసక్తి చూపాలని, క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కడియం MPP వెలుగుబంటి ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కడియం మండల స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య వాలీబాల్ క్రీడా పోటీలు ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MPP పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు మంచి విద్యతో పాటుగా క్రీడలో కూడా రాణించాలన్నారు.
NDL: నందికొట్కూరులో కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న జనార్ధన్ వైన్ షాపును ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఇవాళ తనిఖీ చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు కల్తీ మద్యం పై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనతో పాటు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ప్రజలకు కల్తీ మద్యం అమితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మేల్యే తెలిపారు.
W.G: వృద్ధాప్యంలో ఎక్కువగా కంటి సమస్యలు వస్తుంటాయని, ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవాలన్నారు. మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. భీమవరం మెంటేవారి తోటలో ఇవాళ ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి 100 మందికి ఉచితంగా కళ్లజోళ్లను అందించారు. ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం 450 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు.
KRNL: వెల్దుర్తి పట్టణంలో ఇవాళ రాత్రి 14వ వార్డులో అంగడి ఈశ్వర్ నాయుడు ఇంటి సందులో ఓ ముస్లిం మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
KKD: ప్రాణ రక్షణ కోసం అందరూ భద్రతా నియమాలు పాటించాలని కాకినాడ ట్రాఫిక్-1సీఐ ఎన్. లక్ష్మీ రమేష్ పేర్కొన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నందు ఉన్న పీఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ వాడకం, ఈవ్ టీజింగ్ తదితర అంశాలుపై విద్యార్థినులకు పలు సూచనలు చేశారు.