ASR: డుంబ్రిగూడ మండలంలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన చాపరాయి జలపాతంలో పర్యటకులు సందడి చేశారు. వీకెండ్ కావడంతో జలపాతం అందాలను తిలకించేందుకు ఉదయం నుంచి పర్యటకులు తరలివచ్చారు. దీంతో పర్యాటకులతో కళకళలాడింది. జలపాతం వద్ద సరదాగా స్థానాలు చేస్తూ ఆనందంగా గడిపారు. గిరిజన సంప్రదాయ దుస్తుల్లో ఫోటోలు దిగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రకాశం: కనిగిరిలో ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో జరిగే ప్రజా ఉద్యమ ర్యాలీని జయప్రదం చేయాలని కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ నారాయణ యాదవ్ ఆదివారం సూచించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీకి తరలిరావాలన్నారు.
VZM: గజపతినగరం మండలం మర్రివలస పాఠశాల ఉపాధ్యాయుడు కనకల చంద్రరావును తెలంగాణ ప్రగతి ఫౌండేషన్ వారు గురుదేవోభవ అవార్డుకు ఎంపిక చేశారు. మన రాష్ట్రం నుంచొ చంద్రరావు మాస్టారును ఎంపిక చేశారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఇస్తున్న ఈ అవార్డును నవంబర్ 9వ తేదీన హైదరాబాదులో జరగనున్న సంస్థ కార్యక్రమంలో అందజేస్తామని నిర్వాహకులు ఆదివారం తెలిపారు.
CTR: కుప్పం నియోజకవర్గంలో 7 పరిశ్రమల ఏర్పాటుకు ఈ నెల 28న CM చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. కుప్పం ప్రాంత పారిశ్రామిక వికాసం దిశగా, ప్రగతి పథంలో ముందడుగులో భాగంగా రూ.2,203 కోట్ల పెట్టుబడితో దాదాపు 22 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు రానున్నాయి.
KDP: పాలగిరి గ్రామంలో వెలసిన కన్నెటమ్మ అమ్మవారు ఆదివారం సందర్భంగా విశేషాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నిమ్మకాయలు, పూలదండలతో అందంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పలువురు తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
KDP: వీరప్ప నాయన పల్లె మండలం తలుపనూరులో కొలువై ఉన్న గంగమ్మ అమ్మవారికి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త నాగిరెడ్డి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
NTR: మైలవరం ప్రాంతంలో వేప,రావి,మద్ది,తుమ్మ వంటి చెట్లను వ్యాపారులు ఇటుక బట్టీలకు తరలించడం పర్యావరణానికి ముప్పుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ చెట్లపై ఆధారపడే పిచ్చుక, చిలుక వంటి పక్షులు ఆవాసాలు కోల్పోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే, రాబోయే కొన్నేళ్లలో చెట్లు,పక్షులు కనుమరుగై పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరించారు.
KRNL: బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఉలిందకొండ పీఎస్‌లో ఎర్రిస్వామి ఫిర్యాదుతో శివశంకర్‌పై 281, 125(A), 106(1) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తాను, శివశంకర్ మద్యం సేవించామని, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని తెలిపాడు. శివశంకర్ స్పాట్లోనే మృతిచెందగా.. తాను ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొన్నాడు.
కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు ఎస్సై చంటిబాబు ఆదివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు భవిష్యత్తులో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడకూడదని, సమాజంలో మంచి వ్యక్తులుగా మారాలని సూచించారు. చట్టం పట్ల గౌరవం కలిగి, కుటుంబం సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బ్రహ్మంగారిమఠం మండలంలోని నేలటూరి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేలటూరి సర్పంచ్ సుబ్బరామిరెడ్డి కూతురు అకాల మరణం పొందారు. విషయం తెలుసుకున్న మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామీరెడ్డి, బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి ఆదివారం సుబ్బరామిరెడ్డి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు.
ATP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను ఆదివారం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కలిశారు. అనంతపురంలోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా పాపంపేట భూములపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై వారు చర్చించినట్లు సమాచారం. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని వారు నిర్ణయించారు.
AKP: తుఫాన్ కారణంగా అనకాపల్లి జిల్లాలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు ఈనెల 27 నుంచి 29 వరకు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆదేశాల మేరకు డీఈవో అప్పారావు నాయుడు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలు తెరవకూడదన్నారు. ఏదైనా పాఠశాల తెరిచినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు.
NLR: మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన ఉదయగిరిలో ప్రజా ఉద్యమ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. 28వ తేదీ ఉదయం వైఎస్సార్ విగ్రహం నుంచి MRO కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టి అనంతరం MROకు వినతిపత్రం అందజేస్తారన్నారు.
SKLM: డ్రగ్స్ గంజాయి వంటి మత్తుపదార్థాలకు యువత బానిస కారాదని కోటబొమ్మాళి ఎస్సై వై. సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక మండలం ప్రకాష్ నగర్ కాలనీలో కార్డెన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఆన్‌లైన్ మోసాలకు గురి కావద్దని, మత్తుపదార్థాలు అక్రమరవాణా జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బాల్యవివాహాలు నేరమని ఆయన హెచ్చరించారు.
కోనసీమ: మొంతా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిథిలావస్థలో ఉన్న గోడలు, పాత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని, ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితులు ఉంటే తక్షణమే సమాచారం అందించాలని ఆయన తెలిపారు.