ప్రకాశం: త్రిపురాంతకంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి దంపతులకు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మంత్రికి ఈవో అనిల్ కుమార్ అర్చకులు ప్రసాద్ శర్మ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి దంపతులు పూజలు చేశారు. అర్చకులు మంత్రికి అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు.
AKP: తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను అధికారులు ముందుగా గుర్తించాలని తుఫాన్ జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ చంద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహీన్ సిన్హాతో కలిసి సమీక్షించారు. శాఖల వారీగా చేసిన ముందస్తు ఏర్పాట్లపై ఆరా తీశారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని తెలిపారు.
E.G: రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు ‘మొంథా’ తుఫాన్ నేపధ్యంలో గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల గ్రామంలో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఇళ్లకు ముందస్తు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో 4 కుటుంబాలను స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు.
VZM: తుఫాన్ నేపథ్యంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం ఎస్ కోట మండలం మూలబొడ్డవర, దారపర్తి, భర్తాపురం గ్రామాల్లో సోమవారం తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సతీష్ తదితర అధికారులతో కలసి పర్యటించారు. తుఫాన్ వర్షాలు కారణంగా భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రమాదకరమైన వాగులు దాటవద్దని, అత్యవసరమైతే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల్లో ముందస్తు చర్యల్లో బాగంగా సీతానగరం పిహెచ్‌సీని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర సమయాల్లో అవసరమైన మందులు, ఐవి ఇంజక్షన్లు, పాముకాటు చికిత్సకు ఏఎస్వీ ఇంజక్షన్ల లభ్యతపై తనిఖీ చేశారు.
ASR: డుంబ్రిగూడ మండలంలోని పోతంగి పంచాయతీ పనసపుట్టు మోడల్ కాలనీలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి తాగునీరు సరఫరా చేసే మోటర్ మరమ్మతులకు గురవడంతో గత ఐదు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్లి కాలుష్యమైన ఊట నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానిక గిరిజనులు తెలిపారు.
CTR: పలమనేరు పట్టణం, అక్టోబర్ 27 మెంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, దివ్యాంగులకు సామాజిక సేవా కార్యకర్త మధు మోహన్ రావు అన్నపూర్ణగా నిలిచారు. ఈ రోజు పలమనేరు పరిసర ప్రాంతాల్లో వృద్ధులు, దివ్యాంగులకు విజిటేబుల్ అన్నం ప్యాకెట్లు అందజేశారు. కాగా, ఇటువంటి వర్షాకాలంలో మాలాంటి వారికి అన్నం ప్యాకెట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ATP: గుంతకల్లు పట్టణంలో సోమవారం ఉరుముల, మెరుపులతో ఓ మోస్తారు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని.. ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సంబంధిత వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
VZM: ఉచిత వైద్యాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఎస్. కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. ఎల్ కోట మండలం పోతంపేట, లచ్చంపేట, నరసన్నపేటలో సోమవారం జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరిస్తున్నామని అన్నారు.
సత్యసాయి: గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త ఆర్యవైశ్య సభ్యులు కొమ్మిశెట్టి నారాయణ మూర్తి సోమవారం స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి వారి ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల కోసం ఆర్థిక సాయంగా రూ. 22 వేలు అందజేశారు.
ELR: నంబర్ 2న నిర్వహించేనున్న సమాధుల పండగ సందర్భంగా సోమవారం వంగాయగూడెం క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ వద్ద జంగల్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో తుమ్మ చెట్లను నరికి శ్రమదానం చేశారు. స్మశాన వాటికలో మంచినీటి బోరు, స్మశాన వాటిక వద్ద పూడిక నిమిత్తం మట్టి కావాలని టీం సభ్యులు ఎమ్మెల్యేని కోరగా సమస్యను ఎమ్మెల్యే పరిష్కరిస్తామన్నారు.
BPT: ‘మొంథా’ తుపానును ఎదుర్కొనేందుకు రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన దళం రంగంలోకి దిగింది. సోమవారం 35 మంది సభ్యులతో కూడిన SDRF బృందం బాపట్ల సూర్యలంక సముద్ర తీరానికి చేరుకుంది. తుఫాను పరిస్థితిని ఈ బృందం పరిశీలించింది. జిల్లాలో పరిస్థితులను బట్టి సేవలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొంటామని అన్నారు.
PPM: పాచిపెంట మండలంలో లోతట్టు గ్రామాలలో అధికారుల బృందం పర్యటిస్తున్నారు. సోమవారం తహసీల్దార్ రవి, ఎంపీడీఓ బీవీజే పాత్రో, ఏంఈఓ సతీష్ కర్రివలస గ్రామంలో పర్యటించారు. పెద్దగెడ్డ రిజర్వాయర్ నీరు ఎక్కువ విడుదల చేస్తే గ్రామ పొలిమేరల్లో ఉన్న నివాస ప్రాంతాల్లోకి నీరు వచ్చే అవకాశం ఉందని, నది పక్కన పశువులు ఉంచకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
CTR: మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో న్యాయస్థానం దోషుల వాదనలు వినింది. ఈ మేరకు ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు తుది తీర్పు వెలువరించనున్నట్లు జడ్జి ప్రకటించారు. కాగా, ఆ రోజున దోషులను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.
TPT: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం ఉదయం తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మొంథా తుఫాన్ ప్రభావిత మండలాల గురించి కలెక్టర్‌కు తెలియజేశారు. ఈ మేరకు తుఫాన్ ప్రభావిత మండలాలను ఆదుకోవాలని కోరారు. అనంతరం నియోజకవర్గంలో అధికారులను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.