ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ కడప జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈనెల 23,24,25 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11. 30 గంటలకు కడపకు చేరుకొని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. 2 గంటలు హెలికాఫ్టర్ లో కడప జిల్లా కమలాపురం వెళ్లి అక్కడి కార్యక్రమాలలో పాల్గొని సాయంత్రం ఇడుపులపాయ చేరుకొని రాత్రి బస చేస్తారు. 24వ తేదీ మధ్యాహ్నం పులివెందుల కు వెళ్లి కొన్ని కార్యక్రమాల...
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా పని చేద్దామని మంత్రులకు, పార్టీ కేడర్‌కు చెప్పిన మరుసటి రోజునే మంత్రి అంబటి రాంబాబు పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాదు, వైసీపీని ఇరుకున పెట్టాయి. పవన్ వ్యాఖ్యలకు తోడు బాధిత కుటుంబం కూడా అవును… మంత్రి అంబటి తమను సగం డబ్బు అడిగారని చెప్పడం గమనార్హం. ఆగస్ట్‌లో ఓ ప్రమాదంలో కొడుకును కోల్పోయిన అనాథ ...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించారు. 2018 ఎన్నికల అనంతరం టీడీపీ మొదటిసారి తెలంగాణలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు సమైక్య రాష్ట్రంగా ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమని వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలిసే అవకాశం లేదని బుద...
మొదలు పెట్టిన బీఆర్ఎస్… ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సెల్స్…! దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ అడుగుపెట్టారు. ఇప్పటి వరకు కేవలం తెలంగాణకు పరిమితమైన పార్టీని… జాతీయ పార్టీ గా మార్చేశారు. బీఆర్ఎస్ ని అన్ని రాష్ట్రాల ప్రజలకు దగ్గర చేసేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. జాతీయ పార్టీ ఆవిర్భావం నాడే.. ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ అని నినదించిన కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ...
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. మళ్లీ రాజకీయాల్లో చురుకుగా మారుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల సమయానికి ఏ పార్టీలో చేరుతారు అనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా… ఆయన కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ లో చేరతారంటూ ప్రచారం కూడా మొదలైంది. ఆ పార్టీ నుంచి ఏపీలో జేడీ పోటీ చేయనున్నారంటూ ఎక్కువగా వినపడుతోంది. ఈ నేపథ్యంలో… ఆ రూమర్స్ పై తాజాగా జేడీ స్పందించారు. విశాఖ నుంచి ఎంపీ గా పోటీ చేయాలని అనుకుంటున...
ఇప్పుడు అంతా పాదయాత్రల కాలం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనవరి 26వ తేదీన పాదయాత్రను ప్రారంభించే అవకాశమున్నట్లు ఆ పార్టీ ఏపీ కొత్త అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. తమ పాదయాత్ర ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు. ఆయన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ పాదయాత్ర ద్వారా తమ పార్టీలో పునరుత్తేజం తీసుకు వస్తామని, తిరిగి పుంజు...
ఇప్పటం గ్రామం… కొన్ని నెలల వరకు ఏపీలో ఈ గ్రామం ఒకటి ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు. కానీ… ఎప్పుడైతే అక్కడ ఇల్లు పడకొట్టారంటూ వారు ఆందోళన చేయడం… వారికి పవన్ మద్దతు ఇవ్వడం జరిగిందో.. అప్పుడు ఈ గ్రామం ఫేమస్ అయిపోయింది. ఈ గ్రామం అందరికీ తెలిసిపోయింది. పవన్ వారికి మద్దతు తెలిపినప్పుడు… అందరూ నిజంగానే ఆ గ్రామస్థులకు అన్యాయం జరిగిందని భావించారు. కానీ… వారు ఈ విషయంలో క...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు శుభవార్త తెలియజేశాడు. పెన్షన్ పెంచేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నేడు సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు విషయాలను చర్చించిన వారు.. పెన్షన్ విషయంలోనూ నిర్ణయం తీసుకున్నారు. రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెన్షన్ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 62.31 లక్షల మంది పెన్...
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం వారాహిపై రాద్దాంతం కొనసాగుతోంది. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సందర్భం వచ్చినప్పుడు, పదే పదే జనసేనానిని టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు వారాహిని టార్గెట్ చేస్తోంది. పవన్ వాహనం ఆలివ్ గ్రీన్‌లో ఉందని, ఇదీ మిలటరీ రంగులా ఉందని, కాబట్టి రిజిస్ట్రేషన్ కాదని వైసీపీ నేతలు మొదట చెప్పారు. కానీ అది ఆలివ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని తేలింది. అంతేకాదు, తెల...
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఇటీవల కేంద్రమంత్రి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు సభలో లేవనెత్తుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో నాటి కాంగ్రెస్ పార్టీ బిల్లులో పెట్టకుండానే, ప్రత్యేక హోదా హామీని ఇచ్చింది. తాము బిల్లులోని ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేక హోదా బిల్లులో లేదని, అలాగే ఇప్పుడు సాధ్యం క...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని ఇటీవల భారత రాష్ట్ర సమితిగా(BRS) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈసీ ఆమోదం లభించడంతో, BRSను లాంఛనంగా ప్రారంభించారు. కర్నాటక సహా వివిధ రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో పోటీ విషయం పక్కన పెడితే, పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పోటీపై జోరుగా చర్చ సాగుతోంది. సమైక్య ఆంధ్రప్...
జనసేనాని పవన్ కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా తిరగనీయవద్దనే ఉద్దేశ్యంతో, ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు వైసీపీ చేస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన సంఘటనలకు తోడు, ఇప్పడుు పవన్ ఎన్నికల ప్రచారరథం వారాహి పైన వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు. వారాహి రిజిస్ట్రేషన్, రిజిస్ట్రేషన్ తెలంగాణలో జరిగిందని తెలిసిన అనంతరం వైసీపీ వ్యాఖ్యలు చూస్తుంటే, భ...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వైస్ చైర్మన్ పదవి చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితా నుండి ఆయన పేరును తొలగించారు. తన పేరును ప్రకటించినందుకు తొలుత విజయసాయి రెడ్డి థ్యాంక్స్ కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన పేరు కనిపించకపోవడం విజయసాయి రెడ్డికి షాక్ అని చెప్పవచ్చు. ఈ నెల 5వ తేదీన మొత్తం ఎనిమిది మందితో కూడిన ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితాను రాజ్యస...
ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం జగన్ ని విమర్శిస్తూ ఇదేం కర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రతిపక్ష టీడీపీ చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా…. ఈ కార్యక్రమంలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గురు, శుక్ర, శని వారాల్లో గుంటూరు, బాపట్లలో పర్యటించనున్నారు. నేడు పెదకాకాని, నారాకోడూరు, పొన్నూరులో పర్యటన ఉంటుంది. నారాకోడూరులో రైతులతో సమావేశం కానున్నారు. రాత్రి పొన్నూరులో బస ...
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో జరిగిన జయహో బీసీ మహాసభలో అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2024 ఎన్నికల్లో మారీచులు, పెత్తందారులతో యుద్ధం తప్పదన్నారు. చంద్రబాబు, ఆయన వర్గీయులు ఏ వర్గానికి ప్రతినిధులో అందరికీ తెలిసిందే అన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేస్తారని, వా...