పోలవరం వైసీసీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు రాజమండ్రి సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత స్టంట్ వేశారు. ఐసీయూ అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భార్య రాజ్యలక్ష్మి చెప్పారు. రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్...
తిరుమల లడ్డూ కౌంటర్‌లో చోరీ జరిగింది. కార్పొరేషన్ ఉద్యోగి నుంచి రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరా ఫుటేజి ద్వారా అనుమానితుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూ కాంప్లెక్సులో రాజా కిషోర్ కౌంటర్ బాయ్‌గా చేరాడు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా నెలరోజుల క్రితం డ్యూడీలో జాయిన్ అయ్యాడు. సోమవారం రాత్రి 36వ కౌంటరులో వర్...
అధికారం మారాలంటే నేతలు కొత్త స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. ఉచిత పథకాలు, హామీలు ఇవ్వడంతోపాటు జనంతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు, జగన్ కూడా పాదయాత్ర చేసి అధికారం దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర సీజన్ నడుస్తోంది. ఏపీలో వారాహి వాహనంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, యువగళం పేరుతో నారా లోకేశ్,...
జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. తన ఏపీ యాత్ర కోసం ఉపయోగించే ఎన్నికల రథం వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయని చెప్పారు. ఆయన వచ్చే ఎన్నికల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. మూడు ఆప్షన్లలో ఒక ఆప్షన్ గా బీజ...
వచ్చే ఎన్నికలలో నేను మళ్లీ పోటీ చేయకపోవచ్చునని మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. నరసరావుపేట ఎంపీ సీటు పైన కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సీటును కడప వాళ్లకు ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని షాకింగ్ కామెంట్స్ చేసారు. తమ వర్గం సహకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గుంటూరు అమరావతి రోడ్డులో నిర్వహించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ...
నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు ఎట్టకేలకు అనుమతి లభించింది. పోలీసులు అనుమతి ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠకు తెరపడింది. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. దీంతో ముందుగానే నిర్ణయించిన జనవరి 27న ఫిక్స్ చేసిన ముహూర్తానికే కుప్పం నియోజకవర్గం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభంకానుంది. పోలీసుల నుంచి అనుమతి కోసం టీడీపీ నేతలు ఎన్నో విధాలుగా యత్నించారు. కానీ పోలీసుల నుంచి ఎటు...
తమ పార్టీ నేత నారా లోకేష్ పాదయాత్ర ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తుందని తెలుగుదేశం మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. ఆయన పాదయాత్రతో వైసీపీ కుక్కలకు జ్వరం పట్టుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పాదయాత్ర చేసే హక్కు ఉందన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రి మృతిని కూడా జగన్ రాజకీయం చేశారని ధ్వజమెత్తారు. .మంత్రి రోజాకు రాజకీ...
అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పులలో తెలుగు విద్యార్థి దుర్మరణం చెందాడు. మరొక విద్యార్థికి గాయాలు అయ్యాయి. వీరితోనే ఉన్న మరో తెలుగు విద్యార్థి కాల్పుల ఘటన నుండి బయటపడ్డారు. విజయవాడకు చెందిన నందెపు దేవాశిష్ హైదరాబాద్‌లో ఉంటూ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. తెలంగాణలోని సంగారెడ్డి రామచంద్రాపురంకు చెందిన సాయిచరణ్ ఈ నెల 11న అమెరికాలో ఎంఎస్ కోసం వెళ్లారు. వీరు చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్...
నేడు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటా కింద అంగ ప్రదక్షిణ టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. ఆన్ లైన్ ద్వారా టీటీడీ ఈ టికెట్లను విడుదల చేయనుంది. అయితే కొన్ని రోజుల పాటు ఈ అంగ ప్రదక్షిణ టికెట్లను టీటీడీ జారీ చేయడం ఆపేయనుంది. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22వ తేది నుంచి 28వ తేది వరకూ ఈ అంగప్రదక్షిణ టోకెన్ల జారీని ఆపివేయనున్నట్లు [&h...
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్ర ప్రారంభానికి ముందు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం కోసం లోకేష్ బుధవారం రాత్రి తిరుమలకు చేరుకుంటారు. 27న కుప్పం నుండి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు లోకేష్. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకొని, ప్రారంభిస్తారు. 25వ తేదీ మధ్యాహ్నం గం.1.20కి హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి మొదట ఎన్టీఆర్ ఘా...
వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవచ్చని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జగన్ ఇవ్వలేను అంటే తానైనా ఏమీ చేసేదీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందు వాపోయారు. ఏది ఏమైనా విబేధాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పని చేయాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కొన్నాళ్ల నుంచి బాలినేని పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి నుంచి వైదొ...
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పిఠాపురం – సామర్లకోట మధ్య పట్టాలు గూడ్స్ రైలు పట్టాలు తప్పగా.. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. రైలు పట్టాలు తప్పడంతో విశాఖపట్నం నుంచి విజయవాడ రూట్‌లో పలు రైళ్లు రాకపోకలు ఆలస్యం అవుతున్నాయని అధికారులు తెలిపారు. పిఠాపురంలో స్టేషన్‌లో యశ్వంతపూర్, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్ర...
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది. ఇటీవలే డీజీపీ ర్యాంకు పొందిన సునీల్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మాత్తుగా బదిలీ చేసింది. సీఐడీ అదనపు డీజీగా సంజయ్‌కి అదనపు బాధ్యతలు అప్పగించింది. సంజయ్ ప్రస్తుతం ఫైర్ సర్వీసెస్ డీజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఐడీ పేరు, సునీల్ కుమార...
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. యువ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నాడు.వైజాగ్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మరణానికి వ్యక్తిగత సమస్యలే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. 2013 లో కిశోర్ తిరుమల డైరెక్టర్ వహించిన సెకండ్ హ్యాండ్ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వత వర ముళ్లపూడి దర్మకత్వంలో కుందనపు బొమ్మ చిత్రంలో నటించారు. ఈ సినిమా 2016 లో రిలీజ్ అయింది. మరికొన్ని సిన...
మరో నాలుగురోజుల్లో నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం కానుంది. పోలీసుల అనుమతి రాకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహించొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జీవో నంబర్ 1 అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ వైఖరిని విపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. ప్రతిపక్షాల గొంతు అ...