వచ్చే ఎన్నికలలో నేను మళ్లీ పోటీ చేయకపోవచ్చునని మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. నరసరావుపేట ఎంపీ సీటు పైన కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సీటును కడప వాళ్లకు ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని షాకింగ్ కామెంట్స్ చేసారు. తమ వర్గం సహకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గుంటూరు అమరావతి రోడ్డులో నిర్వహించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకోవడం లేదన్నారు. తమ కుటుంబం నుండి రెండు అసెంబ్లీ సీట్లు కావాలని గతంలోనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అడిగినట్లు చెప్పారు. రాయపాటి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎంపీగా పని చేశారు. విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు.