ఏపీ(Andhrapradesh)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ అభిమాన హీరో ఫ్లెక్సీ కడుతుంటే కరెంట్ షాక్ (Electric Shock) తగిలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. విద్యార్థులిద్దరూ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లా నరసరావు పేట(Narasaraopet)లో ఈ దారుణ ఘటన జరిగింది. మృతులను నక్కా వెంకటేశ్, పోలూరు సాయిలుగా గుర్తించినట్లు పోలీసులు(Police) తెలిపారు.
పోలీసుల సమాచారం మేరకు..తమిళ స్టార్ హీరో సూర్య(Hero surya) పుట్టిన రోజు (Birthday) సందర్భంగా తమ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కడుతూ వేడుకలు చేసుకుంటున్నారు. తమ అభిమాన నటుడి పుట్టినరోజును పలు ప్రాంతాల్లో వేడుకగా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా మోపూరివారిపాలేనికి చెందిన వెంకటేశ్, బాపట్ల జిల్లా జే పంగలూరుకు చెందిన సాయిలు కూడా సూర్య పుట్టిన రోజు వేడుకలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు.
వేడుకల్లో(Birthday Celebrations) భాగంగా తమ స్నేహితులతో కలిసి శనివారం రాత్రి నరసరావు పేటలో ఫ్లేక్సీ(Flexi)లు కట్టారు. అయితే వారు ఫ్లెక్సీ కడుతుండగా ఐరన్ ఫ్రేమ్(Iron Frame) పక్కనే ఉన్నటువంటి విద్యుత్ తీగలు తాకాయి. దీంతో కరెంట్ షాక్(Electric Shock)తో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై హీరో సూర్య (Hero surya) ఇంతవరకూ స్పందించలేదు.