• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

AP Minister జయరాం కి ఐటీ నోటీసులు..!

AP Minister : ఆంధ్రప్రదేశ్ మంత్రి జయరాం కి ఐటీ అధికారులు షాకిచ్చారు. ఆయనకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. క‌ర్నూలు జిల్లాలో మంత్రి జ‌య‌రాం భార్య రేణుక‌మ్మ పేరుతో 30 ఏక‌రాలు, స‌న్నిహితుల పేరుతో మ‌రో 90 ఎక‌రాల స్థ‌లం రిజిస్ట‌ర్ కావ‌డంపై ఐటీ శాఖ దృష్టి సారించింది.

March 3, 2023 / 11:37 AM IST

Lakshmi Parvathi : షాకింగ్ కామెంట్స్.. పవన్ పార్టీ పెట్టడానికి కారణం చంద్రబాబే..!

Lakshmi Parvathi : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పై వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ చేత పార్టీ పెట్టించింది చంద్రబాబేనని ఆమె పేర్కొన్నారు. పవన్ కి అసలు పార్టీ పెట్టే ఆలోచనే లేదని... ఇదంతా చంద్రబాబు ప్లాన్ అని ఆమె పేర్కొనడం విశేషం.

March 3, 2023 / 10:39 AM IST

CI Girija నువ్వేంట్రా చెప్పేది.. ఏం **..తావ్: రెచ్చిపోయిన మైలవరం సీఐ

బాధితుడికి న్యాయం చేయాల్సి ఉండగా ఉల్టా అతడిపైకి తిరగబడ్డారు. బూతులు తిడుతూ.. ఎక్కువ చేస్తే లేని కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు. పైగా ఆమె ఓ మహిళ కావడం గమనార్హం. దీనికి సంబంధించిన కాల్ రికార్డ్ వైరల్ అయ్యింది.

March 3, 2023 / 10:21 AM IST

Garbage Tax ఎవరయ్యా చెప్పింది? అంటూ మీడియాపై ఏపీ మంత్రి చిందులు

రాజకీయ దురుద్దేశంతోనే ఇది చెబుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం బాదుడే బాదుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వేస్తున్న పన్నులకు సరికొత్త పేరు పెట్టిన విషయం తెలిసిందే. ‘జే ట్యాక్స్ (J Tax)’ అంటూ కొత్త పేరుతో సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఆ జే ట్యాక్స్ లో భాగంగానే చెత్తపై కూడా పన్ను వేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

March 3, 2023 / 06:55 AM IST

personal video in Social Media: శోభనం వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టిన భర్త అరెస్ట్

సోషల్ మీడియా (social media) వచ్చాక కొందరి పిచ్చి వెర్రితలలు వేస్తోంది. పదిమందికీ చేరువవ్వాలన్న ఆరాటం కొందరితో పిచ్చి పనులు చేయిస్తోంది. విచక్షణ కోల్పోయి గోప్యంగా ఉంచాల్సిన వాటిని కూడా బయటపెట్టేసుకుని కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు.

March 3, 2023 / 11:13 AM IST

Atchannaidu : జే ట్యాక్స్ కి భయపడి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు… అచ్చెన్నాయుడు..!

Atchannaidu ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై  టీడీపీ సీనియర్ నేత కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శల వర్షం కురిపించారు. జగన్ కి భయపడే రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన ఆరోపించారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క సదస్సు కూడా ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.

March 2, 2023 / 08:41 PM IST

Minister Roja : రాజధానిపై మంత్రి రోజా ఆసక్తికర ట్వీట్…!

Minister Roja ఏపీ రాజధాని విషయంలో ఎవరు ఎన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినా... అధికార పార్టీ మాత్రం... ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది. విశాఖను రాజధానిగా చేయాలని నిర్ణయం తీసేసుకుంది. దానికి సంకేతంగా... జగన్, రోజా, ఇతర మంత్రులు ఒకరి తర్వాత మరొకరు ఏదో ఒక రూపంలో తెలియజేస్తూనే ఉన్నారు.

March 2, 2023 / 08:23 PM IST

tdp mlc bachula arjunudu గుండెపోటుతో మృతి.. నేతల సంతాపం

mlc bachula arjunudu: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మృతిచెందారు. ఈ రోజు విజయవాడ రమేశ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. గుండెపోటు రావడంతో నెలరోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ రోజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఆయన మృతిపై టీడీపీ శ్రేణులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

March 2, 2023 / 06:57 PM IST

CBI interrogate Sudhakar:వివేకా హత్య కేసులో పీబీసీ సుధాకర్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

CBI interrogate Sudhakar:మాజీమంత్రి వైఎస్ వివేకానంద (ys viveka) హత్య కేసు విచారణను సీబీఐ స్పీడప్ చేసింది. ఇటీవల ఎంక్వైరీని స్పీడప్ చేసింది. ఎవరి సందేహాం కలిగిన.. నోటీసులు ఇచ్చి మరీ విచారిస్తోంది. ఈ రోజు పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్‌ను (sudhakar) విచారించారు. కడపలో వివిధ అంశాలపై 2 గంటల పాటు (2 hours) విచారించారు.

March 2, 2023 / 06:13 PM IST

minister amarnath on global summit:46 దేశాల ప్రతినిధులు.. 2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం

minister amarnath on global summit:విశాఖపట్నంలో (vizag) నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (global investor summit) ద్వారా రూ.2లక్షల కోట్ల (2 lakh investment) పెట్టుబడులను ఆకర్షించడం తమ లక్ష్యం అని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (amarnath) అన్నారు. దీంతో యువతకు ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పారు. విశాఖలో గల జీఐఎస్ వేదిక వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

March 2, 2023 / 05:32 PM IST

Vishnu Vardhan Reddy : వైసీపీని ఎదుర్కొనే సత్తా టీడీపీ కి లేదు..!

Vishnu Vardhan Reddy : ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఎదుర్కొనే సత్తా టీడీపీకి లేదు అని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి అభిప్రాయడపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాము సత్తా చాటి తీరతామని ఆయన పేర్కొన్నారు. వైసీపీకి పోటీగా నిలిచే పార్టీ బీజేపీ మాత్రమేనని ఆయన అన్నారు.

March 2, 2023 / 05:26 PM IST

Adimulapu Suresh : రాజధానిపై కామెంట్స్..!

Adimulapu Suresh : రాజధానిపై మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ రాజధానిగా మారబోతోందంటూ ఆయన పేర్కొన్నారు. అయితే... పూర్తి స్థాయి రాజధానిగా మారుతుందా అని విలేఖరులు ప్రశ్నించగా.. ఆయన దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.

March 2, 2023 / 04:19 PM IST

Anil Kumar Yadav: లోకేష్, పవన్ కళ్యాణ్‌లకు దమ్ముందా?

తెలుగు దేశం (Telugu Desam), జనసేన (Janasena) పార్టీలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (anil kumar yadav) సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (andhra pradesh assembly elections 2024) జనసేనానికి పవన్ కళ్యాణ్ కు (Janasena chief Pawan Kalyan), తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)కు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.

March 2, 2023 / 01:58 PM IST

Inferior food:తిరుమల అన్నదాన సత్రంలో నాసికరం భోజనం (వీడియో)

Inferior food:అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి. నిత్యం వేలాది భక్తులు శ్రీవారిని దర్శించుకొని తరిస్తారు. ఆ తర్వాత టీటీడీకి చెందిన సత్రంలోనే భోజనం చేస్తుంటారు. ఇక్కడ రుచి, శుచి, శుభ్రత పాటిస్తారు. అయితే టీటీడీ సత్రంలో భోజనం బాగుండటం లేదట. దానికి సంబంధించిన వీడియోను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

March 2, 2023 / 01:59 PM IST

Telangana Minister KTR: ఆ న్యూస్ షేర్ చేసి… ఆంధ్రప్రదేశ్‌కు విషెస్ చెప్పిన కేటీఆర్

పెట్టుబడుల (Investments) సమీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) రేపటి నుండి (మార్చి 3, 4 తేదీలు) విశాఖపట్నం (Visakhapatnam)లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ (Global Investors Summit) నేపథ్యంలో తెలంగాణ (Telangana) మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister) తోటి తెలుగు రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపారు.

March 2, 2023 / 12:23 PM IST