• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు బైరెడ్డిపల్లికి ఎమ్మెల్యే పర్యటన

CTR: పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి బైరెడ్డిపల్లిలో ఆదివారం పర్యటించనున్నట్లు ఎంపీడీవో ఉపేంద్ర తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖల పురోగతి నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు.

February 21, 2026 / 12:15 PM IST

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి

ప్రకాశం: జరుగుమల్లిలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా చెత్త ఊడ్చి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

February 21, 2026 / 12:11 PM IST

ఘనంగా మాతృభాషా దినోత్సవం

CTR: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని శనివారం పుంగనూరు కొత్తయిండ్లు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా విజ్ఞాన వికాస సమితి అధ్యక్షలు రెడ్డప్ప రెడ్డి యాదవ్ నిర్వహించారు. ఈసందర్భంగా అయన విద్యార్థులను ఉద్దేశించి అయన ప్రశాంగించారు. అమ్మ వంటి మాతృభాషను ఎన్నటికీ మరవకూడదన్నారు. తెలుగు భాష యొక్క ఔన్నత్యం గురించి వివరించారు.

February 21, 2026 / 12:11 PM IST

ఘనంగా ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలు

KDP: బద్వేలులో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే డా. సుధ శుభాకాంక్షలు తెలిపారు. యద్దారెడ్డి స్వగృహంలో మాజీ కుడా చైర్మన్ గురుమోహన్ అభినందనలు తెలియజేశారు. ఆనంద నిలయంలో వైసీపీ నాయకులు సింగనమల వెంకటేశ్వర్లు కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేశారు.

February 21, 2026 / 12:08 PM IST

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం:DIEO

PPM: ఈనెల 23వ తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మన్యం జిల్లా లో 33 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని DIEO వై.నాగేశ్వరరావు శనివారం ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 17,530 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. రెండు ఫ్లయింగ్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్, DEC మెంబర్స్ కన్వీనర్ DIEO మొత్తం నాలుగు వాహనాల్లో పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో తనిఖీలు నిర్వహిస్తారు.

February 21, 2026 / 12:01 PM IST

‘అగ్ని బాధితులకు న్యాయం చేస్తాం’

E.G: రాజమండ్రి రూరల్ మండలం సుబ్బారావు పేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో మద్దా నూతయ్య, వనులమ్మకు చెందిన తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు ఏసు తదితరులు బాధిత కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించి నిత్యవసర సరుకులు అందజేశారు. దృష్టి తీసుకెళ్ళి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.

February 21, 2026 / 12:01 PM IST

స్వచ్ఛ ఆంధ్రా–స్వచ్ఛ భారత్ దిశగా శ్రీకాకుళం: ఎమ్మెల్యే

SKLM: స్వచ్ఛ ఆంధ్రా-స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో ప్రత్యేక శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. డీసీబీ కాలనీలో మొక్కలు నాటడం, ఉమా రుద్ర కోటేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో శుభ్రతా పనులు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కార్మికులతో కలిసి స్వయంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజల సహకారం అవసరమని ఆయన అన్నారు.

February 21, 2026 / 12:00 PM IST

VIDEO: వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ

సత్యసాయి: లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌవలసముద్రం టోల్ ప్లాజా వద్ద పోలీసులు శనివారం ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, ఎస్సై నరేంద్ర వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచిస్తూ, పలువురికి హెల్మెట్లు పంపిణీ చేశారు.

February 21, 2026 / 12:00 PM IST

పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం.. వైసీపీ కార్యకర్త మృతి

ATP: పెళ్లికి వెళ్తూ జరిగిన కారు ప్రమాదంలో ఉరవకొండకు చెందిన వైసీపీ కార్యకర్త నాగేష్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి నాగేష్ భౌతికకాయానికి శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తను కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

February 21, 2026 / 11:57 AM IST

‘కొయ్యూరు మండల అభివృద్ధికి కృషి చేయాలి’

ASR: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి కొయ్యూరు మండలాభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ బడుగు రమేశ్ సూచించారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

February 21, 2026 / 11:55 AM IST

తిరుపతి విమానాశ్రయ పురోగతి, అభివృద్ధి పనుల్ని సమీక్షించిన కేంద్ర మంత్రి

SKLM: తిరుపతి విమానాశ్రయ పురోగతి, అభివృద్ధి పనులను MoCA కార్యదర్శి సమీర్ కుమార్ శర్మ, AAI ఛైర్మన్ కుమార్ జైన్‌లతో కలిసి శనివారం కేంద్ర విమానయాన శాఖమంత్రి రాంమోహన్ సమీక్షించారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు “కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్” విజన్‌కు అనుగుణంగా, పవిత్ర తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ని మెరుగైన రీతిలో అనుసంధానం చేయడానికి చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

February 21, 2026 / 11:54 AM IST

44 హైవే పై రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు

ATP: గుత్తి మండలం కరటికొండ సమీపంలోని 44 హైవేపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డు దాటుతున్న ఆచారి అనే వ్యక్తిని కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆచారికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.కారు కర్నూలు నుంచి గుత్తికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 21, 2026 / 11:51 AM IST

లక్ష్మీనరసింహస్వామికి వైభవంగా పల్లకి సేవ

ప్రకాశం: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి పల్లకి సేవా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు చోడా వీరభద్రస్వామి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులుకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 11:45 AM IST

ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేట నియోజకవర్గ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజల నుండి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి నమ్మకాన్ని నిలబెట్టడమే తన కర్తవ్యమని స్పష్టం చేశారు.

February 21, 2026 / 11:43 AM IST

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

GNTR: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో శనివారం నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల్లో శుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు. మండల పరిషత్ ఉర్దూ పాఠశాల, ఆంగన్‌వాడి కేంద్రాలను సందర్శించిన ఆయన చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 11:42 AM IST