Amarnath హత్యలో రాజకీయ ప్రమేయం లేదు, ఏం జరిగిందంటే: ఎస్పీ
పదో తరగతి విద్యార్థి అమర్ నాథ్ హత్యలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టంచేశారు. మృతుడు, నిందితుడికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని చెప్పారు.
Amarnath Murder: బాపట్ల జిల్లాలో సంచలనం రేపిన పదో తరగతి విద్యార్థి అమర్ నాథ్ (Amarnath) హత్యకు రాజకీయ రంగు పులుముకుంది. అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలు మృతుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. దీంతో ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అమర్ నాథ్ (Amarnath) హత్యకు సంబంధించిన వివరాలను బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వివరించారు.
వార్నింగ్ ఇవ్వడంతో పగ
అమర్ నాథ్ (Amarnath) తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి, అక్క, తాతతో కలిసి ఉంటున్నాడు. అయితే రాజోలు పంచాయతీ రెడ్లపాలేనికి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి.. అమర్ నాథ్ సోదరిని ఇబ్బంది పెడుతున్నాడు. ప్రేమిస్తున్నానని వెంటపడటంతో అతనికి అమర్ నాథ్ (Amarnath) వార్నింగ్ ఇచ్చాడు. నలుగురి ముందు ఇష్యూ ప్రస్తావించి.. వార్నింగ్ ఇచ్చాడు. దీంతో వెంకటేశ్వర్ రెడ్డి కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా సరే బుద్ది చెప్పాలని అనుకున్నాడు.
అడ్డగించి, పెట్రోల్ పోసి
ఒక రోజు ముందే పెట్రోల్ కొనుగోలు చేశాడు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ట్యూషన్ వెళ్తున్న అమర్ నాథ్‌ను (Amarnath) అడ్డగించాడు. మొక్కజొన్న బస్తాల లాట్ వెనక ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అమర్ నాథ్ (Amarnath) హత్య కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశాం అని.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్పీ వివరించారు. మృతుడు, నిందితుడికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ అని తెలిపారు. రాజకీయాలు ఆపాదించొద్దు అని సూచించారు. ఘటన జరిగిన వెంటనే స్పందించి.. నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.