ఇటీవల జనసేన పార్టీ నేత అని చెప్పుకుంటూ తిరుగుతున్న రఘవరావు ఓ బాలికను వేధించిన సంగతి తెలిసిందే. ప్రేమ, పెళ్లి అంటూ ఇబ్బంది కూడా పెట్టాడు. ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. అయితే… అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని జనసేన క్లారిటీ ఇచ్చింది. కాగా… ఈ విషయంపై తాజాగా మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.
‘మహిళల పట్ల తప్పుగా, అసభ్యంగా లైంగింక వేధింపులకు గురిచేసేవాళ్ళని జనసేన పార్టీ ఎప్పుడూ క్షమించదు, అది తన వారైనా లేదా ఇతరులైనా సరే, ఈ విషయంలో జనసేన పార్టీ రాజీపడే ప్రసక్తే లేదు, తప్పు చేసినవాళ్ళు ఎవరైనా సరే న్యాయం ముందు నిలబడి తీర్పుని ఎదుర్కోవాల్సిందే’ అంటూ ట్వీట్ చేశారు.
రాఘవరావు తనను ప్రేమించాలంటూ ఓ యువతి వెంటపడ్డాడు. మనవరాలి వయసు ఉండే అమ్మాయితో వెకిలిగా ప్రవర్తించాడరు. ఫుల్లుగా మందుకొట్టి ఆమె ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. ఏకంగా కత్తి తీసుకొని తనను ప్రేమించకపోతే చంపేస్తానని.. తన భార్యను కూడా వదులుకునేందకు సిద్ధమన్నాడు. అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసినా వెనక్కు తగ్గలేదు.. అందరిని దుర్భాషలాడాడు. ‘మీ మనవరాలు వయసు ఉన్న అమ్మాయితో ఇలా ప్రవర్తించడం సరికాదు’ అని వారించినా వినలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రాఘవరావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.