బ్రో మూవీలో నటుడు ఫృథ్వీ డ్యాన్స్ మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల్లో చేసిన డ్యాన్స్ మాదిరిగా ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. ఓడినోడికి కాళరాత్రి అని కౌంటర్ అటాక్ చేశారు.
Minister Ambati Rambabu Counter At BRO Movie Prithvi Dance
Ambati Rambabu: బ్రో మూవీలో నటుడు ఫృథ్వీతో ఓ డ్యాన్స్ ఉంటుంది. ఏంటీ సాంబాబు ఆ డ్యాన్స్ ఏంటీ అని హీరో పవన్ కల్యాణ్ అంటారు. ఆ మూవీలో ఫృథ్వీ క్యారెక్టర్ పేరు సాంబాబు.. మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పేరుకు దగ్గరగా ఉంది. సంక్రాంతి సమయంలో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తన నియోజకవర్గంలో డ్యాన్స్ చేశారు. ఆ సమయంలో సంబరాల రాంబాబు అని ట్రోల్‌కు గురయ్యారు. తాజాగా పవన్ మూవీలో ఆయనను పోలిన క్యారెక్టర్ రోల్ పృథ్వీ చేశాడు.
సంక్రాంతి సమయంలో రాంబాబు (Rambabu) వేసుకున్న డ్రెస్‌ను పోలిన డ్రెస్ మూవీలో పృథ్వీ వేసుకున్నాడు. దానికి పవన్ కల్యాణ్ (pawan kalyan) డైలాగ్స్ ఉండటంతో.. రాంబాబును కౌంటర్ చేసినట్టు ఉంది. దీనికి సంబంధించి ట్రోల్ కావడంతో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు. గెలిచోనోడి డ్యాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డ్యాన్స్ కాళరాత్రి అని ట్వీట్ చేశారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పవన్ కల్యాణ్ పోటీచేసి ఓడిపోయారు. అతని పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలిచిన సంగతి తెలిసిందే. మంత్రి అంబటి చేసిన ట్వీట్‌కు పవన్‌కు ట్యాగ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. సమయం దొరికితే చాలు ఇరు పార్టీల నేతలు రెచ్చిపోతుంటారు. సంక్రాంతి సమయంలో అంబటి రాంబాబును (Ambati Rambabu) పోలిన డ్యాన్స్ మూవీలో పెడితే.. మంత్రి కూడా అదేస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఎన్నికల్లో తాను గెలిచానని.. అందుకే డ్యాన్స్ చేశానని చెప్పుకొచ్చారు. ఓడినవారికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని.. కాళరాత్రి అని రాసుకొచ్చారు. పవన్‌ను ఇండైరెక్టుగా టార్గెట్ చేశారు. మంత్రి అంబటి చేసిన ట్వీట్‌కు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించాల్సి ఉంది. జనసేన నేతలు అయినా రియాక్ట్ అవ్వాల్సి ఉంది.