మెగా ఫ్యామిలీపై మంత్రి రోజా కామెంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఆ కుటుంబం నుంచి ఏడుగురు వరకు హీరోలు ఉన్నారని, అందుకే చిన్న ఆర్టిస్టులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ చెప్పినట్టు అంతా నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కామెంట్లపై నటుడు బ్రహ్మజీ కౌంటర్ ఇచ్చారు. ‘తనను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కోరలేదు? పార్టీలో చేరమని అడగలేదు? చిన్న ఆర్టిస్టులు ఎందుకు భయపడతారు’ అని బ్రహ్మజీ ట్వీట్ చేశారు. మంత్రి రోజా లక్ష్యంగా విరుచుకుపడ్డారు.
గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీని రోజా టార్గెట్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ శ్రీకాకుళం రణస్థలంలో రోజాను డైమండ్ రాణి అని కామెంట్ చేయడంతో వివాదం మొదలైంది. పవన్ కల్యాణ్, నాగబాబు లక్ష్యంగా రోజా కౌంట్ ఇచ్చారు. చిరంజీవిని మాత్రం కామెంట్ చేయనని, ఆయన రాజకీయాల్లో లేరని చెప్పారు. ఇంతలోనే మెగా ఫ్యామిలీపై విమర్శలు చేశారు. అందులో ఆర్టిస్టులను కలిపి కామెంట్ చేశారు. భయపడుతున్నారని అనడంతో నటుడు బ్రహ్మజీ స్పందించారు.