ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ విజయవాడలో ప్రత్యక్షం అయ్యారు. ఆయనతో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఉన్నారు. తన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు పీకేను లోకేశ్ తీసుకొచ్చారు.
Lokesh: ఏపీ అసెంబ్లీకి ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. సీఎం జగన్ సిట్టింగులను మారుస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ తామేం తక్కువ కాదని అంటోంది. అవును.. ఏకంగా ప్రశాంత్ కిశోర్‌తో కలిసి పనిచేయనుంది.
ప్రస్తుతం టీడీపీ తరఫున రాబిన్ శర్మ ఎన్నికల వ్యుహకర్తగా ఉన్నారు. ఆయనతో లాభం లేదని అనుకుంది. అందుకే హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రశాంత్ కిశోర్‌ను వెంట పెట్టుకొని వచ్చారు నారా లోకేశ్ (Lokesh). అక్కడ చంద్రబాబుతో మంతనాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమికి పీకే వ్యుహకర్తగా పనిచేసే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పీకే పనిచేసిన సంగతి తెలిసిందే. కావాలి జగన్.. రావాలి జగన్ అనే పాట ఊపు తీసుకొచ్చింది. ఓకే ఒక్క ఛాన్స్ అని జగన్ అనడంతో జనం అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత జగన్- పీకే మధ్య సంబంధాలు చెడాయి. సో.. ఇప్పుడు లోకేశ్.. పీకేను వెంట పెట్టుకొని వచ్చారు. తమకు వ్యుహకర్తగా పనిచేయాలని కోరతారని విశ్వసనీయ సమాచారం.
చంద్రబాబుతో భేటీలో ఆ అంశంపై క్లారిటీ వస్తోంది. ఆ తర్వాత ప్రకటన ఉండనుంది. ప్రస్తుతం అయితే ఏపీలో టీడీపీ- జనసేన కలిసి పోటీకి దిగతాయి. వారితో బీజేపీ కలిసి వచ్చే అంశంపై మాత్రం స్పష్టత లేదు.