»Kurnool Wife Conducts Her Husband Funeral Rites At Home In Pattikonda
Kurnoolలో దారుణం: కొడుకులతో వద్దని ఇంట్లోనే భర్తకు అంత్యక్రియలు చేసిన భార్య
ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. జరిగిన విషయాన్ని వివరించింది. కాగా, ఆమె చేసిన పని అందరినీ కలచి వేసింది.
కొడుకులు (Sons) ఆస్తి కోసం గొడవ చేస్తారని భయపడిన ఆ తల్లి (Mother) మృతిచెందిన తన భర్త మృతదేహాన్ని (Dead Body) బయటకు తీసుకురాకుండా ఇంట్లోనే దహన సంస్కారాలు (Cremation) చేసింది. అయితే ఇంట్లో నుంచి పొగలు రావడంతో ఈ దారుణం వెలుగులోకి చోటుచేసుకుంది. ఈ సంఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో (Kurnool District) చోటుచేసుకుంది.
పత్తికొండ (Pattikonda) పట్టణానికి చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్ (60), లలిత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దినేశ్ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తుండగా.. కుమారుడు కెనడాలో (Canada) స్థిరపడ్డారు. పత్తికొండలో మెడికల్ షాప్ (Medical Shop)నిర్వహిస్తూ ఈ దంపతులు జీవనం సాగిస్తున్నారు. అయితే సోమవారం తెల్లవారుజామున భర్త హరికృష్ణ ప్రసాద్ అనారోగ్యంతో కన్నుమూశాడు.
తండ్రి మరణించాడనే విషయం తెలిస్తే ఇద్దరు కుమారులు ఆస్తి (Assets) కోసం గొడవ పడతారని లలిత భావించింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని భావించి ఇంట్లోనే ఉన్న అట్ట పెట్టెలతో (Cotton Box) భర్త అంత్యక్రియలు నిర్వహించింది. అయితే ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. జరిగిన విషయాన్ని వివరించింది. కాగా, ఆమె చేసిన పని అందరినీ కలచి వేసింది. తమ కుమారులు ఇద్దరు తమను సరిగా చూసుకోవడం లేదని తల్లి లలిత వాపోయింది. ఆస్తి కోసమే తమ వద్దకు వస్తున్నారని కన్నీటితో చెప్పింది. ఇలాంటి కొడుకుల చేతిలో కన్నా నా చేతిలో అంత్యక్రియలు చేసినట్లు ఆమె తెలిపింది.