టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. వాహనాల కుంభకోణం లో ఈడీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. బస్సుల కొనుగోలు కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి సహా ఆయన అనుచరుడి ఆస్థుల్ని ఈడీ ఎటాచ్ చేయడం విశేషం. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్ రెడ్డికి చెందిన దివాకర్ రోడ్‌లైన్స్, జఠాదర ఇండస్ట్రీస్‌కు చెందిన 22.10 కోట్ల ఆస్థుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేసింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు జరిగినట్టుగా ఈడీ గుర్తించింది. అశోక్ లేలాండ్ నుంచి తక్కువ ధరకే వాహనాలు కొనుగోలు చేయడం, స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లతో కొత్త వాహనాలు నడపడం జరిగిందని ఈడీ తెలిపింది.
ఈడీ ఆస్తులు అటాచ్ చేసిన నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డిస్పందించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈడీ విచారణ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘నాకు ఈడీ రూపంలోనే దేవుడు ఉన్నాడు’. మాకు వాహనాలు అమ్మిన అశోక్ లైలాండ్ను విచారణ చేయలేదు. నాగాలాండ్ అధికారులను ఎంక్వైరీ చేయాలి. సుమారు 38 కోట్ల స్కామ్ అంటున్నారు.. అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
ఈ కేసులో కొంతమంది ఉన్నతాధికారులు ఇరుక్కుంటారు. ఇందులో ప్రధాన సూత్రధారి అశోక్ లేలాండ్.. వారిని ముందు విచారణ చేయాలి. ముందుగా వారిని విచారించి మిగతావారిని విచారించాలన్నారు.