తెలంగాణలో ముందస్తు ఎన్నికల విషయంలో క్లారిటీ వచ్చేసింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని ఏకంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో… తెలంగాణ విషయంలో క్లారిటీ వచ్చింది. అయితే… ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జగన్ ఆ మేరకు ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.
కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతుండటం, అభివృద్ధి విషయంలో విమర్శలు ఎదురవుతుండటం, ఆలస్యం చేస్తే ఇతర పార్టీలు పొత్తులతో ఓడించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
మరోవైపు జగన్ ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తుండగా కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని జగన్ కు ఇప్పటికే స్పష్టత వచ్చింది. పోలీస్ శాఖలో జగన్ చేస్తున్న బదిలీల వెనుక కూడా రాజకీయపరమైన కారణాలు ఉన్నాయని సమాచారం. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని జగన్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.
సీఎం కేసీఆర్ సైతం గతంలో ముందస్తు ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టి మళ్లీ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ప్రస్తుతం జగన్ కు వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం కీలకం కావడంతో ఆయన ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు వేస్తున్నారు. సలహాదారుల సూచనల మేరకు ముందస్తు ఎన్నికలపై జగన్ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.
త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటనలు చేసే ఛాన్స్ కూడా ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.