ఏపీలోని ఏలూరు(Eluru) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ముసునూరు మండలం రమణక్క పేటలో జ్యోత్స్న(jyotsna) అనే మహిళను భర్త నాగుల్ మీరా దారుణంగా హత్య చేశాడు. గురువారం రాత్రి జ్యోత్స్న(jyotsna)ను నాగుల్ మీరా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
ఏపీలోని ఏలూరు(Eluru) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ముసునూరు మండలం రమణక్క పేటలో జ్యోత్స్న(jyotsna) అనే మహిళను భర్త నాగుల్ మీరా దారుణంగా హత్య చేశాడు. గురువారం రాత్రి జ్యోత్స్న(jyotsna)ను నాగుల్ మీరా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు..నాగుల్ మీరా, జ్యోత్స్న(jyotsna)లు ప్రేమ వివాహం చేసుకున్నారు.
గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ వల్ల నాగుల్ మీరా తీవ్ర కోపానికి లోనయ్యాడు. ఆ క్రమంలో భార్య జ్యోత్స్నపై కత్తితో దాడి చేశాడు. భర్త చేతిలో తీవ్రంగా గాయపడిన జ్యోత్న్స అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ విషయాన్ని జ్యోత్స్న(jyotsna) కుమారులు షేక్ వాజిబ్, షేక్ వసీంలు తమ మేనమామకు సమాచారాన్ని అందించారు. మేనమామ సంఘటనా స్థలానికి వచ్చి చూసే సరికి జ్యోత్న్స విగత జీవిగా పడి ఉంది. జ్యోత్స్న మృతిచెందినట్లు గుర్తించిన నాగుల్ మీరా అక్కడి నుంచి పరారయ్యాడు.
జ్యోత్స్న, నాగుల్ మీరాలు 2015లో ప్రేమ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేవారు. అయితే కొంతకాలానికి కట్నం కోసం ఆమెను నాగుల్ మీరా కట్నం కోసం వేధించడం మొదలు పెట్టినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కట్నం వేధింపులు తాళలేక జ్యోత్న్స(jyotsna) నాగుల్ మీరా వల్ల తీవ్ర మానసికి వేదనను అనుభవించింది. అయినప్పటికీ వేధింపులు మాత్రం ఆగేవి కావు. రానురాను ఆ కట్నం వేధింపులు ఎక్కువ కావడంతో జ్యోత్స్న పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో నాగుల్ మీరా భార్యపై అనుమానం పెంచుకుని మరో రకంగానూ బాధపెట్టడం మొదలు పెట్టాడు.
భార్యను వేధింపులకు గురి చేస్తూ తీవ్రం బాధపెట్టేవాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా జ్యోత్స్న(jyotsna)పై అభ్యంతరకర పోస్టులు కూడా పెట్టి మానసిక వేధనకు గురి చేశాడు. ఈ విషయమై గత ఏడాది అక్టోబర్లో బాధితురాలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి తన బాధను తెలియజేసింది. పోలీసుల భయంతో నాగుల్ మీరా తన స్వగ్రామమైన తిరువూరుకు వెళ్లిపోయాడు. అయితే నిన్న రాత్రి జ్యోత్స్న(jyotsna) వద్దకు నాగుల్ మీరా వచ్చి ఆమెతో మరోసారి వాగ్వాదానికి దిగాడు. అంతేకాకుండా ఆమెపై చేయిచేసుకున్నాడు. ఈ క్రమంలో కత్తితో పొడిచి చంపాడు. సంఘటనా స్థలాన్ని నూజీవీడు డీఎస్పీ పరిశీలించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏలూరు(Eluru) జిల్లాలోనే ఇటీవలె తల్లీకూతురు హత్యకు గురైన సంగతి తెలిసిందే. జిల్లాలోని కాట్రేనిపాడులో మరియమ్మ అనే మహిళ కూతురు ఫిబ్రవరి 4వ తేదిన హత్యకు గురైంది. ఆ కేసులో మరియమ్మతో సహజీవనం చేసిన రవీందర్, అతని స్నేహితుడు చందులు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.