»He Strangled The Young Woman He Was A Suicide Attempt
Chittoor : యువతి గొంతుకోసి చంపేశాడు.. తాను ఆత్మహత్యాయత్నం
జిల్లాలోని కొండమిట్ట(Kondamitta)లో దారుణం చోటుచేసుకుంది.. బ్యూటీ పార్లర్(Beauty parlour)లో పనిచేస్తున్న యువతిని అత్యంత కిరాతంగా గొంతుకోసి చంపేశాడు ఓ యువకుడు. వేలూరు రోడ్డులోని ఆనందా ధియేటర్(Ananda Theatre) వద్ద మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బ్యూటీ పార్లర్లోకి ప్రవేశించిన యువకుడు చక్రవర్తి.. ముందుగానే తనతో తెచ్చుకున్న పదునైన కత్తితో విచక్షణారహితంగా ప్రశాంతి గొంతు కోశాడు.
చిత్తూరు జిల్లాలోని కొండమిట్ట(Kondamitta)లో దారుణం జరిగింది. వేలూరు రోడ్డులోని కొండమిట్ట ప్రాంతంలో ఉన్న ఓ బ్యూటీ పార్లర్(Beauty parlour)లో పనిచేస్తున్న ప్రశాంతి అనే యువతి దారుణ హత్య(Brutal murder)కు గురైంది. దారుణంగా గొంతుకోసి చంపేశాడో యువకుడు అంతటితో ఆగకుండా ఆ యువతి ప్రశాంతిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు యువకుడు చక్రవర్తి. కొన ఊపిరితో ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మృతురాలు చిత్తూరు (Chittoor) తాలూకా స్టేషన్ లోని కానిస్టేబుల్ నాగరాజు కుమార్తెగా గుర్తించారు.ఓ బ్యూటీపార్లర్ (Beauty parlour) లో రక్తపు మడుగులో యువతి, యువకులను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు,. యువతి దుర్గా ప్రశాంతి 28 సంఘటనా స్ధలంలోనే మృతిచెందింది.
కొన ఊపిరితో ఉన్న యువకుడు చక్రవర్తిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనకు కారణాలపై పోలీసులు (police) ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో షాక్ కి గురయ్యారు మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు. ఆస్పత్రి(Hospital) లో చికిత్స పొందుతున్న యువకుడిని విచారిస్తే గానీ మరింత సమాచారం రాదంటున్నారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్కడి దృశ్యం హృదయ విదారకంగా, రక్తపు మరకలతో నిండి ఉంది. ఇక యువతి హత్య వెనుక ప్రేమ వ్యవహారం (love affair) కారణమా లేక మరేదైన కారణం ఉందా అనే విషయాలు తెలయాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.