SKLM: మహిళల భద్రతకు నారీ శక్తి ఎంతో ఉపయోగకరమని కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. సూర్యనారాయణ సూచించారు. బుధవారం మందస మండల కేంద్రంలో నారి శక్తిపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు భద్రత, రక్షణ కోసం అందుబాటులో తీసుకొచ్చిన శక్తి యాప్ ఉపయోగం, సేవలు, నిక్షిప్తం, రిజిస్ట్రేషన్ గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కృష్ణ ప్రసాద్ ఉన్నారు.