విశాఖ: వెయిటింగ్ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, నవంబర్ 6వ తేదీన సంత్రగచ్చిలో బయల్దేరే సంత్రగచ్చి–యశ్వంత్‌పూర్ (02863) స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు మరో థర్డ్ ఏసీ కోచ్‌ను అదనంగా జతచేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని రైలు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని విశాఖ రైల్వే అధికారులు శనివారం కోరారు.