W.G: కాళ్ల మండలం పెద అమిరంలో వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న పోరుబాట కార్యక్రమ పోస్టర్ను మంగళవారం ఉండి నియోజకవర్గ ఇంఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈనెల 27న విద్యుత్ చార్జీలు బాదుడుపై పోరుబాట కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు.