కాకినాడ జిల్లాలో దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించినట్లు కలెక్టర్ షన్మోహన్ వెల్లడించారు. డిసెంబర్ వరకు స్లాట్స్ బుకింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి స్లాట్ బుకింగ్‌లో తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. అలాగే, కొత్త దరఖాస్తులకు తేదీ ఖరారు చేస్తామని చెప్పారు. కాకినాడ GGHలో ప్రతి మంగళవారం వైద్య పరీక్షలు జరుగుతాయన్నారు.